మ‌ళ్లీ ఏడ్చిన కుమారస్వామి..నెల‌కోమారు ఇదేతంతు

మ‌ళ్లీ ఏడ్చిన కుమారస్వామి..నెల‌కోమారు ఇదేతంతు

హాట్ హాట్ రాజ‌కీయాల‌తో సాగి ఓ కొలిక్కి వ‌చ్చిన క‌ర్ణాట‌క‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపిన  కర్ణాటక సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాజకీయాలకు పదే పదే కన్నీళ్లు పెట్టుకుంటున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తాజాగా, కుమారస్వామి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారస్వామిని కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కచేయడం లేదన్న భావన జేడీఎస్ నేతల్లోనే కాకుండా ప్రజల్లో కూడా క‌లుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ  తాను రాష్ట్రానికి మఖ్యమంత్రిలా కాకుండా ఓ సాధారణ క్లర్క్ లా పనిచేస్తున్నానని కన్నీటిపర్యంతమైనట్లు జేడీఎస్ నేతలు తెలిపారు. కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని..వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వస్తోందని..కుమారస్వామి భావోద్వేగంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు జేడీఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.  కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై కొంతవరకూ వేచి చూసే ధోరణితో వ్యవహరిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నెలకొకసారైనా పబ్లిక్ మీటింగ్స్ లో కన్నీళ్లు పెట్టుకుంటున్న కుమారస్వామి తీరు చూసి ..నెల‌కోమారు  అయినా కన్నీళ్లు పెట్టుకోవడంపై కర్ణాటక ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English