మ‌హిళా ఎంపీ వింత ప్ర‌వ‌ర్త‌న..ఆడుకుంటున్న నెటిజ‌న్లు

మ‌హిళా ఎంపీ వింత ప్ర‌వ‌ర్త‌న..ఆడుకుంటున్న నెటిజ‌న్లు

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా మ‌రో ఎంపీ వింత ప్ర‌వ‌ర్త‌న ఆస‌క్తిక‌రంగా మారింది. జనవరి 8 మంగళవారం లోక్‌సభ సమావేశాల్లో భాగంగా,  ఆర్థికంగా వెనుకబడి జనరల్ కేటగిరీకి 10% రిజర్వేషన్ ఇచ్చే బిల్లుపై  సీరియస్‌గా సాగుతున్న త‌రుణంలో ఓ మ‌హిళ ఎంపీ చిత్రంగా ప్ర‌వ‌ర్తించారు. . సభ్యులంతా కోటా బిల్లు మంచిచెడ్డలపై చర్చించడంలో బిజీగా ఉంటే, చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ హాస్యాస్పదంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు ఆమెను ఆడుకున్నారు.

లోక్‌సభ కీల‌క బిల్లుకు ఆమోదముద్ర వేసే స‌మ‌యంలో ఖేర్ నవ్వుతూ, ఎవరికో సైగలు చేస్తూ, మరో సభ్యుడితో మాట్లాడుతూ కనిపించారు. సభ వ్యవహారాలతో సంబంధమే లేనట్టు ప్రవర్తించారు. ఆమె ఎవరితో మాట్లాడుతున్నారో, ఏమంటున్నారో తెలియదు కానీ ఎంపీ కిరణ్ ఖేర్ మాత్రం చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించి బోల్డంత విమర్శలు మూటగట్టుకున్నారు. ఆమె హావభావాలు, విచిత్ర ముఖకవళికలు చూస్తే మీరు కచ్చితంగా కాలేజీలో బ్యాక్ బెంచ్ లో కూర్చొని చేసిన అల్లరి రోజులు గుర్తుకొస్తాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఎంపీగా ఉన్న స‌భ‌లో ఉన్న విష‌యాన్ని మ‌రిచిపోయి జడ్జిగా ఉన్న ఎంటర్ టైన్ మెంట్ షో ఇండియాజ్ గాట్ టాలెంట్‌లో కూర్చున్న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని కొంద‌రు ఎద్దేవా చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English