రాహుల్‌కు ప్ర‌కాశ్‌రాజ్ మ‌ద్ద‌తు...వేరేలా చూడాల‌ని రిక్వెస్ట్‌

రాహుల్‌కు ప్ర‌కాశ్‌రాజ్ మ‌ద్ద‌తు...వేరేలా చూడాల‌ని రిక్వెస్ట్‌

రాఫెల్ ఒప్పందంపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొనకుండా మోడీ పారిపోయారని, తనను కాపాడాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తిన సంగ‌తి తెలిసిందే. ``చౌకీదార్‌లా దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోడీ లోక్‌సభలో రాఫెల్ ఒప్పందంపై చర్చ జరిగినప్పుడు కనీసం ఒక్క నిమిషం కూడా లేచి నిలబడలేకపోయారన్నారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా నేను ప్రశ్నలు అడిగినప్పుడు 56 అంగుళాల ఛాతీ ఉన్న చౌకీదారు అక్కడినుంచి పారిపోయారు. తనను తాను సమర్థించు కోలేకపోతున్నానని, ఆ పని చేయాలని ఒక మహిళను (రక్షణమంత్రి సీతారామన్‌ను) కోరుకున్నారు. 2.30 గంటలు జరిగిన చర్చలో ఆమె మోడీని సమర్థించలేకపోయారు.`` అంటూ మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాతీయ మానవ హ‌క్కుల క‌మిష‌న్ ఆరోపణలు చేసి నోటీసు అందించిన విష‌యంతెలిసిందే.

ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్  కలిశారు. అనంతరం రాహుల్ మీద చేసిన ఆరోపణలను ప్రకాశ్ రాజ్ స్పందించారు. రాహుల్ గాంధీ ముఖ్య స్థానంలో ట్రాన్స్ జెండర్‌ను నియమించారని, అంతమాత్రాన ఆయన మహిళలకు వ్యతిరేకం కాదని ప్రకాశ్ రాజ్ అన్నారు. `రాహుల్ వ్యాఖ్యలను ఒకే కోణంలో చూడకుండా..వేరే కోణంలో చూడలేరా? పార్లమెంట్ లో చర్చ జరిగిన సమయంలో రాఫెల్ డీల్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వలేదనేది నిజం కాదా? మీరు ఈ విషయాన్ని కూడా గమనించాలి` అని ప్రకాశ్ రాజ్ సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English