ట్రంప్‌ను కొండ‌మీద నుంచి తోసెయ్‌..బీరు తాగిస్తా

ట్రంప్‌ను కొండ‌మీద నుంచి తోసెయ్‌..బీరు తాగిస్తా

డొనాల్డ్ ట్రంప్‌...అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు. ఆయ‌న‌కు ఎంత సెక్యురిటీ ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి వ్య‌క్తిని కొండ‌పై నుంచి తోసేయాల‌ట‌! ఈ డీల్‌కు `సుపారీ` ఏంటో తెలుసా...బీర్‌. ఔను అలా తోసేస్తే..బీరు తాగిస్తాడ‌ట‌. ఈ ప్ర‌తిపాద పెట్టింది ఎవ‌రికంటే....ఒక దేశానికి చెందిన ప్ర‌ధాన‌మంత్రికి. ఈ చిత్రమైన ప్రశ్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురైంది. నిజంగా నిజం. కాకపోతే ఆయన సమాధానం మాత్రం భిన్నంగా ఉంది.

వివ‌రాల్లోకి వెళితే...బ్రిటిష్ కొలంబియాలో టౌన్‌హాల్ మీడింగ్‌లో కెనడా ప్రధాని ప్ర‌జ‌ల‌తో అనుసంధానం అయి వారి ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు ఇస్తున్నారు. ఇలా ప్ర‌ధాన‌మంత్రి సమాధానాలు చెప్తున్నప్పుడు ఓ వృద్ధుడు లేచి బీరు పోయిస్తానంటే ట్రంప్‌ను కొండకొమ్ము మీద నుంచి తోసేస్తావా? అని అడిగేసరికి సమావేశంలో ఉన్నవారంతా అవాక్కయ్యారు. కానీ ట్రూడో ఏమాత్రం తొణకకుండా స్పందించారు. పొరుగుదేశం గురించి అలాంటి హింసాత్మక జోకులు వేయడం భావ్యం కాదని సున్నితంగా చెప్పారు. కెనడాకు ఎవరు ప్రధాని? అమెరికాకు ఎవరు అధ్యక్షుడు? అనేదానితో ప్రమేయం లేకుండా రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య లోతైన సంబంధాలున్నాయని నొక్కిచెప్పారు. ఈ ఇబ్బందికరమైన అనుభవం నుంచి ప్ర‌ధాని స్పంద‌న హుందాగా ఉంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటునున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English