మోడీకి బీపీ పెంచేందుకు ఈ ఫైర్ బ్రాండ్

మోడీకి బీపీ పెంచేందుకు ఈ ఫైర్ బ్రాండ్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై బీజేపీలో అసంతృప్త జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రాభ‌వం సంద‌ర్భంగా భ‌గ్గుమ‌న్న కొంద‌రు అసంతృప్తు వాదులు...సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను పునర్ నియమించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇవి మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చారు. తాజాగా, ఫైర్ బ్రాండ్ నేత‌, బీజేపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి మోడీకి మంట‌పుట్టించే మాట చెప్పారు. అలోక్‌వ‌ర్మ‌కు తిరిగి ప‌ద‌వి ఇవ్వ‌డం మోడీ ప్రభుత్వానికి గొప్ప గుణపాటం అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం డైరెక్ట‌ర్‌ అలోక్ వర్మను కలిసిన సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి, అలోక్‌ వర్మకు మధ్య జరిగిన వివాదంలో స్వామి ప్రభుత్వ వైఖరిని తప్పపట్టారు. అలోక్ వర్మ విషయంలో కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని వెల్లడించారు. కేంద్రం సీబీఐలో తలదూర్చటం , ఆపై సుప్రీం జోక్యం చేసుకుని సరిద్దిద్దటం  లాంటివ  కేంద్రానికి మచ్చ తెచ్చిపెట్టాయని ఆయన వెల్లడించారు. మోడీ తప్పుడు సలహాలు వినకూడదు అని స్వామి స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English