సిటీ ఎంపీ టిక్కెట్లు సెటిలర్లకే

సిటీ ఎంపీ టిక్కెట్లు సెటిలర్లకే

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సన్నాహాలు ప్రారంభించింది. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఘన విజయం సాధించిన టిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికలలోను అదే దూకుడు ప్రదర్శించాలని భావిస్తోంది. ఇప్పటికే లోక్‌సభ సిట్టింగ్‌ ఎంపీలు అందరికీ టిక్కెట్లు ఖయామని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్దానాలలో ఒక స్దానంలో తమ మిత్రుడు అసదుద్దిన్‌కు వదిలేసీ మిగత 16 కైవసం చేసుకోవాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాజధానిలో ఉన్న మల్కాజగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్దానాలను సెట్టిలర్లకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. మల్కాజగిరి లోక్‌సభ సభ్యుడు చామకుర్తి మల్లారెడ్డి శాసన సభకు ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడ నుంచి మరొక అభ్యర్దిని పోటీ చేయించాల్సింది. అలాగే సికింద్రాబాద్ లోక్‌సభ స్దానం నుంచి గత ఎన్నికలలో బిజేపీ గెలుపొందింది. అక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రయ తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది.

మల్కాజగిరి స్దానాన్ని తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు సికింద్రాబాద్‌లో కూడా లోక్‌సభ స్దానాన్ని గెలిపించుకోవాలని టిఆర్‌‌ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు నియోజకవర్గాలలోను సెట్టిలర్స్ అధికంగా ఉండడంతో వారికే టిక్కెట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు.

గత జీహేచ్‌ఎంసీ ఎన్నికలలోను ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలోను కూడా సెట్టిలర్లు టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. సెట్టిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలోనే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనసభ ఎన్నికలలో ప్రచారం చేసారు. అయినా ఇక్కడ టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో సెట్టిలర్లు తమవైపే ఉన్నారని టిఆర్‌ఎస్ భావిస్తోంది. సెట్టిలర్లకు తాము అండగా ఉన్నామని చెప్పేందుకు సికింద్రాబాద్, మల్కాజగిరి స్దానాలను సెట్టిలర్లేకే కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సెట్టిలర్లలో సికింద్రాబాద్ స్దానానికి కమ్మ సామాజిక వర్గం చెందినవారికి, మల్కాజగిరి స్దానానికి బిసీ కులస్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఇప్పటికే సెట్టిలర్లలో అభ్యర్దుల వడపోత ప్రారంభమయిందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English