చంద్రబాబుకు ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్.. టీఆరెస్‌లోకి సుహాసిని?

చంద్రబాబుకు ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్.. టీఆరెస్‌లోకి సుహాసిని?

తెలంగాణ ఎన్నికల్లో నిత్యం ట్రెండింగులో ఉండడంతో నేషనల్ మీడియాలో సైతం వార్తల్లో నిలిచిన అభ్యర్థి నందమూరి సుహాసిని. ఎన్టీ రామారావు మనవరాలిగా... టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. ఆమె కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలంతా క్యూ కట్టి మరీ ప్రచారం చేశారు. అయినా, ఆమె విజయం సాధించలేకపోయారు. ఇప్పుడామె టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి ముందుకొచ్చిందన్నది లేటెస్ట్ టాక్.

కాగా తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చేసిన ప్రకటన తెలిసిందే . సుహాసినిని టీఆరెస్‌లోకి తీసుకోవడమే కేసీఆర్ చంద్రబాబుకు ఇస్తున్న మొదటి రిటర్న్ గిఫ్టని వినిపిస్తోంది.

రాజకీయంగా కేసీఆర్, చంద్రబాబుల మధ్య రోజురోజుకీ గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం టీడీపీలో కలవరం పుట్టిస్తోంది. సాక్షాత్తు నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి టీఆర్ఎస్‌లో చేరితో జనాలకు ఏం సమాధానం చెబుతామని టీడీపీ నేతలు అంటున్నారు.

అయితే... ఎలాగూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాం కాబట్టి ఏ పార్టీ అయితే ఏమిటి? పదవి ఉంటే చాలనే ధోరణిలో సుహాసిని ఎమ్మెల్సీ పదవి కోసం సిద్ధమైనట్లుగా సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English