నాగబాబు గారూ.. రోజా సంగతేంటి?

నాగబాబు గారూ.. రోజా సంగతేంటి?

మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణను లక్ష్యంగా చేసుకుని సెటైర్లు.. విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య పేరెత్తకుండా కొన్ని రోజుల పాటు సెటైర్లు వేసిన ఆయన ఇప్పుడు సీరియస్‌గా వీడియోలు పెడుతూ బాలయ్యను అటాక్ చేస్తున్నారు. బాలయ్య వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. తాను ఇటీవల ఎందుకిలా స్పందిస్తున్నానో వివరించాడు నాగబాబు.

ఆయన మాటలు లాజికల్‌గానే ఉన్నాయి. మెగా అభిమానులకు.. జనసేన మద్దతు దారులకు ఈ మాటలు బాగానే అనిపిస్తున్నాయి. కానీ నాగబాబును వ్యతిరేకించేవాళ్లు ఆయన్ని తేలిగ్గా ఏమీ వదలట్లేదు. బాలయ్య మీద ఇలా రెచ్చిపోతున్న నాగబాబు.. రోజా విషయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

రోజా వివిధ సందర్భాల్లో చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఆ మధ్య పవన్ మాట్లాడుతూ.. చిరంజీవికి అన్యాయం చేసిన వాళ్లను అంత తేలిగ్గా విడిచిపెట్టనని అన్నాడు. దానిపై స్పందిస్తూ.. చిరుకు అత్యంత అన్యాయం చేసింది పవనే అని రోజా విమర్శించింది. ఎన్నికల్లో అన్నయ్య పార్టీ విఫలం కాగానే.. అన్నయ్యను వదిలేసి తన దారిన తాను వెళ్లిపోయాడని రోజా విమర్శించింది.

మరో సందర్భంలో చిరంజీవి ఎందరో అమ్మాయిల్ని పక్కలో పడుకోబెట్టుకున్నాడని అంది. పవన్‌ను ఉద్దేశించి కూడా అలాగే మాట్లాడింది. ఇలా వివిధ సందర్భాల్లో రోజా.. చిరును, పవన్‌ను తీవ్రంగా విమర్శించిన వీడియోలు పట్టుకొచ్చి.. ‘జబర్దస్త్’ కార్యక్రమంలో భాగంగా రోజాతో నాగబాబు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన వీడియోల్ని జోడించి.. నాగబాబు గాలి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు. మరి బాలయ్యను విమర్శిస్తున్న నాగబాబు.. ఆయన కంటే తీవ్రంగా చిరు, పవన్‌లను దూషించిన రోజాను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్న వారికి మెగా బ్రదర్ ఏం సమాధానం చెబుతాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English