ఫస్ట్‌ వాయిస్‌ బయటకు వచ్చింది

ఫస్ట్‌ వాయిస్‌ బయటకు వచ్చింది

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. మహాకూటమి ఘోరంగా ఓడిపోయింది. అయితే.. అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా కానీ కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో పొత్తుపెట్టుకోవడం వల్లే నిండా మునిగిపోయిందనే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. కానీ ఎవ్వరూ బయటపడలేని పరిస్థితి. ఎందుకంటే పొత్తు జరిగింది ఢిల్లీ స్థాయిలో. దీంతో ఎక్కడ బయటపడితే.. తమపై వేటు పడిద్దో అనే ఉద్దేశంతో అందరూ సైలెంట్‌గా ఉండిపోయారు.

త్వరలో లోక్‌సభ ఎన్నికల రాబోతున్నాయి. దీంతో.. టీడీపీ వల్లే మన పుట్టి మునిగింది అనే వాదనను ఒక వాయిస్‌ ఎన్నికల జరిగిన ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలి అని అనుకుంటున్నానని చెప్పిన కోమటిరెడ్డి.. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే బావుంటుందని చెప్పాడు. అంటే ఇన్‌డైరెక్ట్‌ గా.. మొన్నటి ఎన్నికల్లో తమ ఘోర ఓటమికి టీడీపీయే కారణం అని చెప్పకనే చెప్పాడు.

మొదటినుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌. అయితే ఇన్నాళ్లు పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలో అర్థం కాక ఇబ్బందులు పడ్డారు. ఉత్తమ్‌, జానా , షబ్బీర్‌ లాంటి సీనియర్లు కూడా ఓటమిపై మౌనంగా ఉండిపోయారు. టీడీపీ వల్ల ఓడామని వాళ్ల మనసులో ఉన్నా… ఎక్కడ అధిష్టానం ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందమోనని సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు మొదటిసారి కోమటిరెడ్డి రూపంలో.. ఫస్ట్‌ వాయిస్‌ బయటకు వచ్చింది. మరి కోమటిరెడ్డికి మిగిలిన నేతలు సపోర్ట్‌ చేస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English