అమరావతి హైకోర్టులో జగన్‌ కేసు

అమరావతి హైకోర్టులో జగన్‌ కేసు

ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కి తరలి.. అక్కడి నుంచే పని మొదలుపెట్టిన తరువాత మొట్టమొదటి సారి అత్యంత కీలకమైన కేసు అక్కడ విచారణకు వస్తోంది. రాజకీయంగా హై ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించిన, రాజకీయంగా సంచలనం రేపిన  వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసు ఈ రోజు విచారణకు రానుంది. విభజన తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును తొలిసారిగా  విచారించనుంది. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు బదిలీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.

ఈ కేసులో దర్యాప్తు ఆలస్యం అయితే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని గత విచారణలో కోర్టు దృష్టికి ఆర్కే తరపున న్యాయవాది తీసుకొచ్చారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన హైకోర్టు… దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించడంపై అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లేని పక్షంలో తామే ఒక నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు గత విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసును ఎన్ఐఏకు బదిలీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ వేదికగా ఉన్న హైకోర్టు తొలిసారి విచారిస్తుండడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.

వైఎస్ జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్లినప్పుడు అక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తి పదునైన కత్తితో జగన్‌పై దాడి చేశాడు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదన్న ఆరోపణలున్నాయి. దీన్ని వైసీపీ ఆడుతున్న డ్రామాగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిన్నది చేసి చూపే ప్రయత్నం చేసింది. విపక్ష నేత భద్రతను గాలికొదిలేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అంతటా విమర్శలు వచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English