సంక్షోభంలో యాపిల్‌...ఆశ్చ‌ర్య‌పోయే కార‌ణం

సంక్షోభంలో యాపిల్‌...ఆశ్చ‌ర్య‌పోయే కార‌ణం

టెక్నాల‌జీ దిగ్గ‌జం యాపిల్ ఊహించ‌ని చిక్కుల్లో ప‌డిపోతోంది. అనూహ్య రీతిలో ఆ సంస్థ న‌ష్టాల దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఆపిల్‌ కంపెనీ సేల్స్ క్ర‌మంగా ప‌డిపోతున్నాయి. దీనికి కార‌ణం చైనాయే అని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయ‌ప‌డ్డారు. యాపిల్ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టిన వారికి కూడా ఆయ‌న ప‌రోక్షంగా ఇదే సందేశాన్ని వినిపించారు. గ్రేట‌ర్ చైనా ప్రాంత‌మైన చైనాతో పాటు హాంగ్‌కాంగ్‌, తైవాన్ దేశాల్లో యాపిల్ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు దారుణంగా ప‌డిపోయాయి. ఇది ఒక ర‌కంగా సంస్థ‌కు 20 శాతం న‌ష్టాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు టిమ్ కుక్ ఓ లేఖ‌లో ఇన్వెస్ట‌ర్ల‌కు తెలియ‌జేశారు. చైనా మార్కెట్ పెద్ద‌ది, కానీ అక్క‌డ ఐఫోన్‌కు ఆద‌ర‌ణ త‌గ్గింద‌ని, దాని వ‌ల్ల యాపిల్ సంస్థ‌ను చివ‌రి త్రైమాసికం దెబ్బ‌తీసింద‌న్నారు. టిమ్ విశ్లేష‌ణ‌, యాపిల్ న‌ష్టాల నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు కొంత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌, న‌వంబ‌ర్ మాసాల్లో అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. తాజాగా యాపిల్ షేర్ ధ‌ర 7 శాతం ప‌డిపోయింది. అయితే ఇటీవ‌ల ఆ కంపెనీ షేర్లు క్ర‌మంగా ప‌త‌నం అవుతున్నాయి. పండుగ సీజ‌న్‌లో యాపిల్ న‌ష్టాల వైపు వెళ్తున్న తీరు చూస్తుంటే ఆ సంస్థ‌కు మునుముందు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న సంకేతం కనిపిస్తోంది. యాపిల్ న‌ష్టాల పాల‌వ‌డం వెనుక అనేక అంచ‌నాలు వెలువ‌డ‌తున్నాయి. అమెరికా, చైనా మ‌ధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వ‌ల్లే ఈ విప‌త్క‌ర ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మైన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. దీనికి తోడుగా, కొత్త‌గా వ‌స్తున్న ఐఫోన్ మాడ‌ల్స్‌కు అధిక ధ‌ర ఉండ‌డం వ‌ల్ల వాటి అమ్మ‌కాలు అంత‌గా లేవు. దీంతో యాపిల్ షేర్లు ప‌డిపోతున్నాయి. దాని ఫ‌లితంగా అది ఇన్వెస్ట‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English