దీపిక దోశ, రణ్‌బీర్‌ చికెన్‌ కావాలా..?

దీపిక దోశ, రణ్‌బీర్‌ చికెన్‌ కావాలా..?

తమకు ఇష్టమైన సినిమా వాళ్ల పేర్లని బైక్‌లకు, పెంపుడు జంతువులకు పెట్టుకుంటారు కొంతమంది. అభిమానం అనే పిచ్చి ఎక్కువైతే.. ఇంకొంతమంది ఏకంగా తమ పిల్లలకు పేర్లుగా పెట్టుకుంటారు. ఇప్పుడు అలాంటి అభిమానమే కొంతమందికి ఎక్కువై తమ హోటల్‌లోని వంటకాలకు.. హీరోహీరోయిన్స్‌ పేర్లు పెట్టుకుంటున్నారు.

టెక్సాస్‌లోని ఒక హోటల్‌లో దీపిక దోశ ఉందని మీకు తెలుసా. నిజంగా ఉంది. ఆ హోటల్‌ యజమాని దీపిక పడుకోన్‌కి పిచ్చఫ్యాన్‌. అందుకే ఆమెపై ఉన్న అభిమానంతో తన హోటల్‌ మెనూలో దీపిక దోశను చేర్చాడు. అది కాస్తా ఇప్పుడు టెక్సాస్‌లో బాగా ఫేమస్‌ అయ్యింది. ఎంత ఫేమస్ అంటే..  దీపిక మొగుడు రన్వీర్‌ సింగ్‌కు కూడా పిచ్చ పిచ్చగా నచ్చేసి ట్యాగ్‌ చేసేంత.

దీపిక పేరుతో దోశ ఉంటే.. దీపిక ఎక్స్‌ బోయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్‌ ఏమైనా తక్కువ తిన్నాడా. అందుకే.. అతని పేరుకి కూడా ఓ వంటకాన్ని తగిలించేశారు. గతంలో రాజ్‌నీతి సినిమా కోసం రణ్‌బీర్‌ చంఢీగడ్‌ వెళ్లాడు. అప్పుడు ఓ హోటల్‌లో చికెన్‌ తిన్నాడు. అప్పటినుంచి ఆ చికెన్‌ పేరు.. రణ్‌బీర్‌ చికెన్‌గా మారిపోయింది. సదరు హోటల్‌ యజమాని కూడా రణ్‌బీర్‌ చికెన్‌గానే ఐటెమ్‌ను సర్వ్‌ చేస్తున్నాడు.

దీపిక, రణ్‌బీర్‌లానే అనిల్‌ కపూర్‌ గారాలపట్టి సోనమ్‌కపూర్‌ పేరుతో కూడా ఒక ఐటెమ్ ఉంది. అదే మ్యాంగో బ్లూ బెర్రీ చీస్‌ కేక్‌. ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ కేక్‌.. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో దొరుకుంది. అలాగే.. సంజయ్‌దత్‌ పేరుతో ముంబైలోని మరో దాబాలో చికెన్‌ సంజుబాబా అనే చికెన్‌ ఉంది. టేస్ట్‌ అదే ఉంటుంది కాకపోతే..సినిమా వాళ్ల పేరుతో తయారుచేస్తే.. కాస్త వెరైటీగా ఉంటుంది.
   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English