గ‌వ‌ర్న‌ర్‌తో కేటీఆర్..ఆయ‌న‌తో ప్ర‌కాశ్ రాజ్‌

గ‌వ‌ర్న‌ర్‌తో కేటీఆర్..ఆయ‌న‌తో ప్ర‌కాశ్ రాజ్‌

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన ఆత్మీయ స‌మావేశాలు హైద‌రాబాద్ వేదిక‌గా చోటు చేసుకున్నాయి.! రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ కు పూల మొక్కను ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు.

మ‌రోవైపు ఓ ప్ర‌ముఖుడు కేటీఆర్‌తో స‌మావేశంలో అయ్యారు. రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సినీనటుడు ప్రకాష్‌రాజ్ కేటీఆర్‌తో స‌మావేశం అయ్యారు. 'ప్రజా జీవితంలో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్న ప్రకాష్‌రాజ్‌కు అభినందనలు...సానుకూల మార్పు తీసుకురావడానికి మీ ప్రయాణం ఉపయోగపడాలి' అంటూ ప్రకాష్‌రాజ్ పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తూ కేటీఆర్‌ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన... తన రాజకీయ ప్రయాణానికి స్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ ఆరంభం ఎవరికీ వ్యతిరేకంగా కాదని, సమాజం కోసమే.. ఇక పార్లమెంట్‌లో కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానంటూ ట్వీట్ చేశారు.

ఇదిలాఉండ‌గా, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ప్రకాష్‌ రాజ్ పోటీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రకాష్‌రాజ్‌ను కలిసిన సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను ట్వీట్‌కు ప్రకాష్‌రాజ్ జోడించారు. ప్ర‌కాష్‌రాజ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే చర్చ సాగుతోంది. ఇలా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న త‌రుణంలో కేటీఆర్‌తో ప్ర‌కాశ్ రాజ్ స‌మావేశం అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English