ఫేస్‌బుక్ న‌మ్మ‌ద‌గింది కాదు..కొత్త స‌ర్వేలో క్లారిటీ

ఫేస్‌బుక్ న‌మ్మ‌ద‌గింది కాదు..కొత్త స‌ర్వేలో క్లారిటీ

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ విష‌యంలో సంచ‌ల‌న స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. ఫేస్‌బుక్ అంత నమ్మదగ్గ సంస్థ కాదని ఓ సర్వేలో పాల్గొన్న అత్యధికులు తీర్మానించారు. యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్ బయటి సంస్థలకు చేరవేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రీసెర్చ్ కంపెనీ టోలూనా ఈ సర్వేను నిర్వహించింది. వెయ్యిమంది సర్వేలో పాల్గొన్నారు. వారిలో 40 శాతం మంది ఫేస్‌బుక్ అంత నమ్మదగ్గ సంస్థ కాదని చెప్పారు. తర్వాతి స్థానానికి టై ఏర్పడింది. ట్విట్టర్, అమెజాన్‌లు నమ్మదగ్గ సంస్థలు కావని 8 శాతం మంది చ్పొపున చెప్పారు. కాగా యూబర్‌కు 7 శాతం, గూగుల్‌కు 6 శాతం మంది ఆ ముద్రవేశారు. మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థల పరిస్థితి చాలావరకు మెరుగుగా ఉంది. మైక్రోసాఫ్ట్ అంతగా నమ్మదగ్గ సంస్థ కాదని కేవలం 4 శాతం మంది చెప్పగా, యాపిల్ నమ్మదగ్గ సంస్థ కాదని 2 శాతం మంది మాత్రమే సెలవిచ్చారు. నెట్‌ఫ్లిక్స్, టెస్లా కంపెనీలు కేవలం 1 శాతంతో నమ్మదగ్గ కంపెనీల జాబితాలో అగ్రభాగాన నిలిచాయి.

కాగా కొద్దికాలం క్రితం ఫేస్‌బుక్ గురించి న్యూయార్క్ టైమ్స్  ఓ పరిశోధనాత్మక కథనంలో సంచ‌ల‌న ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యన్ హ్యాకర్లు ఫేస్‌బుక్ డేటాను ఉపయోగించుకోవడంపై కంపెనీ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆ పత్రిక బయటపెట్టింది. అంతేకాకుండా తన విమర్శకులను యూదువ్యతిరేకులని ముద్రవేసి లేదా సామాజికి కార్యకర్తలను బిలియనీర్ పెట్టుబడిదారు జార్జి సోరోస్ మనుషులని ప్రచారం చేసి ఎదురుగదాడికి దిగింది. ప్రజల ఆగ్రహాన్ని ప్రత్యర్థ్థి టెక్ కంపెనీలపైకి మళ్లించాలని చూసిందని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఫేస్‌బుక్ డేటాను కేంబ్రిజ్ అనలిటికా సంస్థ దురుపయోగం చేసిందని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఖండనలతోనే సరిపెట్టింది. కానీ అంతర్గతంగా జరిగిన సమావేశాల్లో అది నిజమేనని ఒప్పుకున్నారు. ఏ సంక్షోభం వచ్చినా వాయిదా వేయడం, ఖండించడం, పక్కదారి పట్టించడం అనే మూడుసూత్రాల మార్గాన్ని అనుసరించిందని పేర్కొన్నది. 50 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, లాబీయిస్టులు, కాంగ్రెస్ సిబ్బందిని ఇంటర్వూ చేసినట్టు తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English