తెలంగాణ నుంచి నన్ను తప్పించండి బాబోయ్

తెలంగాణ నుంచి నన్ను తప్పించండి బాబోయ్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అస్త్ర సన్యాసం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బాధ్యతలు తానిక చూడలేనని, ఇంకెవరినైనా చూసుకోమని ఆయన అధిష్ఠానానికి తెలిపినట్లు పార్టీలో వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమికి బాధ్యత తీసుకోవడంతోపాటు.. ఇక్కడ నాయకుల్లో ఏమాత్రం కసి లేకపోవడంతో ఎంత కష్టపడినా ఏమీ చేయలేమన్న నిర్ధారణకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.

కాగా 2014 నాటికి దిగ్విజయ్‌తో పాటు కుంతియా కూడా తెలంగాణ వ్యవహారాలు చూసేవారు. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో దిగ్విజయ్ తెలంగాణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ పార్టీని అధికారంలోకి తేలేకపోయినందుకు గాను ఆయన తప్పుకున్నారు. దాంతో కుంతియాకు పూర్తి బాధ్యతలు వచ్చాయి. కుంతియా మొన్నటి ఎన్నికల ముందు పార్టీ బలోపేతానికి గట్టి ప్రయత్నాలే చేశారు. ఎన్నికుల మూణ్ణాలుగు నెలల ముందు నుంచి పార్టీ నేతలతో రెగ్యులర్‌గా మీటింగులు పెట్టడం.. అసంతృప్తుల ఇళ్లకు వెళ్లి మరీ బుజ్జగించడం వంటివన్నీ చేశారు.

అదేసమయంలో టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఆలస్యం వంటివి ఆయనపై విమర్శలు తెచ్చాయి. పైగా టిక్కెట్ల కేటాయింపులో సీనియర్ల మాట ఆయన పట్టించుకోలేదని.. కేవలం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాట ప్రకారమే సాగారన్న విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అయితే కుంతియా శనిలా దాపురించారంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు నేతలు రాహుల్ కు ఫిర్యాలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో... అధిష్ఠానం  తనను తప్పించడానికి ముందే తానే తప్పుకోవడం మేలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English