బీజేపీ సీనియ‌ర్ దెబ్బ‌కు మోడీ, షా మైండ్ బ్లాంక్

బీజేపీ సీనియ‌ర్ దెబ్బ‌కు మోడీ, షా మైండ్ బ్లాంక్

ఏక‌చ‌త్రాధిప‌త్యంగా, భారతీయ జనతా పార్టీలో తిరుగులేని నేతలుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్ అమిత్‌షాకు పార్టీలోని అస‌మ్మ‌తి చుక్క‌లు చూపిస్తోందా? ఏకంగా ఇద్ద‌రు నేత‌లు వైఫ‌ల్యాన్ని ప్ర‌శ్నించే స్థాయికి ఈ నివురు గ‌ప్పిన నిప్పు చేరిందా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంత‌ర్గ‌తం, రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరాజయం తర్వాత పార్టీ నేతలపై విమర్శలు చేసిన గడ్కరీ తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల సమావేశంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హోంశాఖ సమర్థంగా పనిచేస్తోందంటే దానికి కారణం సుశిక్షితులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే. వారిలో అనేకమంది తమ పని భేషుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఓ పార్టీ విషయంలోనూ అంతే.. వ్యక్తులు సరిగా పనిచేయాలి. లేదంటే దానికి నాదే బాధ్యత. వారిని సరిగా తీర్చిదిద్దని తప్పు నాదే అవుతుందంటూ వ్యాఖ్యానించారు. వ్యవస్థను సరిగా నడపాల్సిన బాధ్యత నాయకుడిదే. కిందివారు సరిగా పనిచేయనపుడు, కోరుకున్న లక్ష్యాలు నెరవేరనపుడు ఆ నాయకుడే దానికి బాధ్యత వహించాలి అని అభిప్రాయపడ్డారు.

‘‘నేను పార్టీ అధ్యక్షుడిని అయినపుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా..!’’ అంటూ బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌ షాను టార్గెట్ చేశారు. మరోవైపు మోడీపై సెటైరికల్ కామెంట్లు చేశారు కేంద్రమంత్రి... ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించినంత మాత్రాన ఓట్లు రాలవు. మీరు విద్వాంసుడే కావొచ్చు. అన్నీ నాకు తెలుసు అనుకుంటే మీరు పొరబడ్డట్లే. కృత్రిమమైన మార్కెటింగ్‌ ఎల్లకాలం నిలవదంటూ చెప్పుకొచ్చారు. ఇక మరో అడుగు ముందుకేసి జవహర్‌లాల్ నెహ్రూపై ప్రశంసలు కురిపించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగాలంటే తనకు చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు. కాగా గ‌డ్కరీ వ్యాఖ్య‌ల మ‌ర్మం ఏంట‌నే చ‌ర్చ ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English