కేటీఆర్ ఎంట్రీ...ఐదుగురు ఎమ్మెల్యేల‌పై వేటు

కేటీఆర్ ఎంట్రీ...ఐదుగురు ఎమ్మెల్యేల‌పై వేటు

తాజాగా  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇతర రాజకీయ అంశాలపై చర్చ జరుగుతోంది. సమావేశానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

అయితే, తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో టీఆర్‌ఎస్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేల‌పైను రాష్ట్ర క‌మిటీ నుంచి త‌ప్పించారు. తాజాగా ఎన్నికైనవారిలో ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్ర కమిటీ నుంచి రిలీవ్‌ చేసింది. ముఠా గోపాల్‌, సుంకే రవి శంకర్‌, మైనంపల్లి, పట్నం నరేందర్‌ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డిలను రాష్ట్ర కమిటీ నుంచి తప్పిస్తూ కేటీఆర్ సార‌థ్యంలోని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో కేటీఆర్ మార్క్ పార్టీ వ్య‌వ‌హారాలు సాగ‌నున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా, కేటీఆర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వచ్చే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచే విధంగా పని చేయాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. తర్వాత పార్టీ మెంబర్‌షిప్‌, ఇన్సూరెన్స్‌ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. త్వరలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి పార్లమెంట్‌ స్థానానికి ఒక ఇంఛార్జ్‌, జనరల్‌ సెక్రటరీ పని చేయాలని సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English