కేసీఆర్ ఇచ్చిన ఐడియా సోనియా ఫాలో అయి ఉంటే...

కేసీఆర్ ఇచ్చిన ఐడియా సోనియా ఫాలో అయి ఉంటే...

రాజ‌కీయ నాయ‌కుల్లో ఏదైనా త‌మ వెర్ష‌న్లోకి మార్చుకుని చెప్ప‌గ‌లిగిన మాట‌కారిత‌నం కేటీ రామారావుకి ఉంద‌ని అంద‌రికి  తెలిసిందే. ఆ మాట‌కారి త‌న‌మే ఈరోజు ఒక పార్టీని ఆయ‌న చేతుల్లో పెట్టేదాకా వ‌చ్చింది. వార‌సులు రాజ‌కీయాల్లోకి రావ‌డం వేరు, రాణించ‌డం వేరు. ఒక‌పుడు బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్‌తో పార్టీలు బాగా మ‌న‌గ‌లిగేవి. కానీ స‌రికొత్త వ్యూహాల‌తో, చురుకైన వాగ్దాటితో కూడా ఎన్నిక‌ల్లో రాణించొచ్చ‌ని కేసీఆర్ ఫ్యామిలీ నిరూపించింది. కాస్త నిశితంగా ప‌రిశీలిస్తే... సంస్థాగ‌తంగా టీఆర్ఎస్ చాలా బ‌ల‌హీనంగా ఉంది. అయినా కూడా ఎన్నిక‌ల్లో నెగ్గుకురావ‌డానికి కార‌ణం ఆ కుటుంబం మొత్తం హైప‌ర్ యాక్టివ్‌గా ఉండ‌ట‌మే.

కేసీఆర్ ఫ్యామిలీ తాము చెప్పాల‌నుకున్న ప్ర‌తి విష‌యాన్ని ఒక టైమింగ్‌తో చెప్ప‌డం ద్వారా బ‌లంగా ప్ర‌జ‌ల్లో నాటేస్తారు. చూసేవాళ్ల‌కి అది స్పాంటేనియ‌స్ స‌మాధానం అనిపిస్తుంది. కానీ అదో వ్యూహాత్మ‌క స‌మాధానం. ప్ర‌తిదీ ప్లాన్డ్. ఈ న‌వ‌త‌రంలో ఒక రాజ‌కీయ‌నాయ‌కుడు ఎద‌గాలంటే ఇది చాలా అవ‌స‌రం మ‌రి. ఈరోజు జ‌రిగిన మీట్ ది ప్రెస్‌లో ఒక అంశం ఇక్క‌డ ఉదాహ‌ర‌ణగా చెప్పొచ్చు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్స్ పై ఒక జ‌ర్న‌లిస్టు కేటీఆర్ ను ప్ర‌శ్నించింది. సాధార‌ణంగా కేటీఆర్ స్థానంలో ఎవ‌ర‌యినా వేరే వాళ్లు ఉండుంటే.. మేము క‌ట్ట‌బ‌డి ఉన్నాం, ఆ బిల్లుకు మా మ‌ద్ద‌తు ఎపుడూ ఉంటుంది అనేవాళ్లు. కానీ కేటీఆర్ స‌మాధానం భిన్నంగా ఉంది. సంద‌ర్భాన్ని చ‌క్క‌గా వాడుకున్నాడు. కేటీఆర్ చెప్పిన స‌మాధానం ఇది.

*సోనియాగాంధీ యూపీఏ హ‌యాంలో ఉన్న‌పుడు కేసీఆర్ సోనియాకు ఒక స‌ల‌హా ఇచ్చారట‌. మేడ‌మ్ ఇపుడు మీరు మ‌హిళ‌. ఒక మ‌హిళ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న‌పుడు  మ‌హిళా బిల్లును పాస్ చేస్తే మీకు మంచి పేరు వ‌స్తుంది. ఇక‌వేళ ఇపుడున్న 545 మంది స‌భ్యుల్లో అంత రిజ‌ర్వేష‌ను ఇస్తే అభ్యంత‌రాలు ఉంటాయి అనుకుంటే... లోక్‌స‌భ సీట్ల సంఖ్య పెంచండి. ఆ ఎక్కువ‌గా వ‌చ్చిన‌వి మ‌హిళ‌ల‌కు కేటాయించేలా చ‌ర్య‌లు తీసుకోండి. ఆ విధంగా బిల్లు రూపొందించండి అని స‌ల‌హా ఇచ్చార‌ట‌.* ఇది కేటీఆర్ చెప్పిన స‌మాధానం.

ఇది కేవ‌లం కేటీఆర్ ఆన్స‌ర్‌గా కొట్టిపారేయ‌లేం. కేసీఆర్ త‌న కుటుంబాన్ని అలా తీర్చిదిద్దాడు. ఎవ‌రి నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. అందులో రొటీన్ వాటికి ఎలా స్పందించాలి, అనూహ్య‌మైన వాటికి ఎలా స్పందించాలి, మ‌న పార్టీ ప‌ర‌ప‌తి పెంచాలంటే ఏం మాట్లాడాలి. అవి ఏ సంద‌ర్భాల్లో చెబితే జ‌నాల్లోకి బ‌లంగా వెళ‌తాయి...ఇవ‌న్నీ చాలా ప‌ద్ధ‌తిగా అల‌వ‌ర‌చిన విష‌యాలు. మిగ‌తా పార్టీలు పార్టీ మొత్తాన్ని బ‌ల‌ప‌రిచి పార్టీని కాపాడుకుంటుంటే... కేసీఆర్ కేవ‌లం త‌న ఫ్యామిలీని ట్రైన్ చేసి పార్టీ నిల‌బెట్టుకుంటున్నాడు. ఇది చ‌తుర‌త‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English