ల‌గ‌డ‌పాటిపై కేటీఆర్ సెటైర్లు

ల‌గ‌డ‌పాటిపై కేటీఆర్ సెటైర్లు

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తెలంగాణ ఫ‌లితాల త‌ర్వాత క‌నుమ‌రుగైపోయిన మాట వాస్త‌వ‌మే. మ‌రి కేటీఆర్ చెప్పిన‌ట్లు ఆయ‌న స‌ర్వే స‌న్యాసం తీసుకున్నారో లేదో తెలియ‌దు గాని మొత్తానికి ఫ‌లితాలు ఆయ‌న స‌ర్వేకు భిన్నంగా వ‌చ్చాక అస‌లు క‌నిపించ‌డ‌మే మానేశారు. ఈరోజు మీడియా ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ లో టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తూ ల‌గ‌డ‌పాటి విష‌య‌మై స్పందించారు.

మాకు ఉద్దేశ పూర్వ‌కంగా న‌ష్టం చేయ‌డానికి కొంద‌రు ప‌నిచేశారు. కొన్ని మీడియా సంస్థ‌లు కూడా అలాగే చేశాయి. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎన్నిక‌ల ముందు స‌ర్వే విడుద‌ల చేసి జ‌నాల‌ను కన్ఫ్యూజ్ చేయాల‌ని చూశారు. ఆయ‌నే కన్ప్యూజ్ అయిపోయారు అది వేరే విష‌యం. పైగా ఎన్నిక‌ల అనంత‌రం కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోని మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు ఇస్తే, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం టీఆర్ఎస్ ఓడిపోతుందని విచిత్రమైన సర్వేను ఇచ్చారని  అన్నారు. లగడపాటి రాజగోపాల్ ని మహాకూటమి నేతలు నోస్ట్రడామస్, వీరబ్రహ్మేంద్ర స్వామి రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారని సెటైర్లు వేశారు. ల‌గ‌డ‌పాటి బొక్క‌బోర్లా ప‌డ‌టంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలు వ్య‌క్తంచేసి త‌మ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకుంటున్నార‌న్నారు.
 
ఆనాడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మా వ‌ల్లే రాజ‌కీయ స‌న్యాసం పుచ్చుకున్నారు. మ‌ళ్లీ ఇపుడు మా వ‌ల్లే స‌ర్వే స‌న్యాసం పుచ్చుకున్నారు. దురుద్దేశాలు ఏనాటికీ గెల‌వవు, ఎందుకండీ ఇంత అన‌వ‌స‌ర‌పు క‌క్ష‌, దాడి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయ‌న స‌ర్వేల‌ను ఒక‌టి రెండు శాతం న‌మ్మేవార‌ని... ఇపుడు అది కూడా పోయింద‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English