కాంగ్రెస్ ‘ఉత్తముడి’పై కాంతం ఆరోపణలు

కాంగ్రెస్ ‘ఉత్తముడి’పై కాంతం ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీలో ఎవరూ బయటకు చెప్పుకోని లొసుగులు ఎన్నో ఉన్నాయంటారు. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్‌తో రహస్య అవగాహనలు ఉన్నాయని.. అందుకే కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ నేతలకే తొలి నుంచీ నమ్మకం లేదనీ చెప్తారు. కానీ, ఇవన్నీ ఎవరూ ఎన్నడూ బయటకు వెల్లడించలేదు. అక్కడాఇక్కడా గుసగుసలాడుకోవడం మినహా బయటకు పొక్కకుండా చూసుకున్నారు. కానీ, ఇప్పుడు తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకే చెందిన దళిత నేత ఒకరు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారంటూ బహిరంగంగా ఆరోపణలు గుప్పించారు.

టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం బాంబు పేల్చారు. కేసీఆర్‌తో ఉత్తమ్‌ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. కేసీఆర్‌తో కుదిరిన ఒప్పందం కారణంగానే అభ్యర్థులను ఆరు నెలల ముందు ప్రకటిస్తామని చెప్పిన ఉత్తమ్… ఆ తర్వాత ఆఖరి వరకు అభ్యర్థుల ప్రకటన జాప్యమయ్యేలా చేశారని గజ్జెల కాంతం విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా… ఓడినా బాధ్యత వహిస్తానని చెప్పిన ఉత్తమ్ కుమార్‌ రెడ్డి వెంటనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ నాయకత్వాన్ని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంగీకరించడం లేదన్నారు.

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు బయటకు రాకుండా కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావుతో ఉత్తమ్‌ ఒప్పందం చేసుకుని… అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన చాలా ఆలస్యం అయ్యేలా చేశారన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English