తిడతాం, తిట్టించుకుంటాం

తిడతాం, తిట్టించుకుంటాం

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ని పిట్టలదొరగా అభివర్ణించారు కాంగ్రెసు ఎంపి మధుయాస్కీ గౌడ్‌. ఇదే మధుయాస్కీ, తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ పెద్దన్న అని చెప్పారు ఒకప్పుడు. మధుయాస్కీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉండడాన్ని గతంలో హర్షించిన కెసిఆర్‌, ‘తెలంగాణ జాతి రత్నం’ అనే బిరుదు ఇచ్చారు.

కెసిఆర్‌ అప్పుడు బిరుదు ఇచ్చినా, ఆ తర్వాత ‘బుడ్డెర ఖాన్‌’ అని మధుయాస్కీనే విమర్శించారు. అదే మధుయాస్కీకి కోపం తెప్పించింది. నన్ను బుడ్డెరఖాన్‌ అంటావా, నువ్వే పిట్టల దొర అని మధుయాస్కీ రివర్స్‌ ఎటాక్‌కి దిగారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో ఓట్లు సీట్లు దండుకుంటున్న కెసిఆర్‌కి తెలంగాణపై చిత్తశుద్ధి లేదనేశారు యాస్కీ. ఉద్యమం పేరుతో కోట్లు వెనకేసుకున్న కెసిఆర్‌కి తనను విమర్శించే హక్కు లేదన్న యాస్కీ మాయమాటలు చెబుతూ సొంత ఆస్తులు పెంచుకున్నారంటూ కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు.

ఉద్యమం అంటే తిడతాం, తిట్టించుకుంటాం అన్నదే తప్ప, పార్టీలకతీతంగా అందరూ కలిసే ఆలోచన తెలంగాణ నేతలు చేయడంలేదు. ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించానని చెప్పుకునే కెసిఆర్‌ రాజకీయాలు పక్కన పెడితే ఇలాంటి వివాదాలుండవ్‌.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు