ల‌క్ష ఓట్ల‌తో ల‌క్ష్యం చేరారు

ల‌క్ష ఓట్ల‌తో ల‌క్ష్యం చేరారు

ఎన్నిక‌ల్లో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే. అయితే అక్క‌డ పోల‌యిన ఓట్ల‌లో ఎంత మంది ప్ర‌జ‌లు ఆద‌రించారు అన్న‌ది కూడా ముఖ్యం. ఒక్కొక్క ఓటు గెలుపుకు ముఖ్య‌మ‌యిన‌దే. అయితే ల‌క్ష ఓట్లు తెచ్చుకోవ‌డం అనేది మామూలు విష‌యం కాదు. తెలంగాణ‌లోని 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో మొత్తం 26 మంది ఈ ఎన్నిక‌ల్లో ల‌క్ష‌కు పై చిలుకు ఓట్లు సాధించ‌డం విశేషం. అందులో కాంగ్రెస్, టీడీపీల నుండి చెరొక‌రు ల‌క్ష‌కు పైగా ఓట్లు సాధించ‌గా టీఆర్ఎస్ పార్టీ నుండి ఏకంగా 24 మంది ల‌క్ష‌కు పై చిలుకు ఓట్లు సాధించారు. ఇందులో ప్ర‌త్య‌ర్ధులు బ‌ల‌హీనంగా ఉండ‌డం కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌కు ఓట్లు రాల్చ‌గా, అభ్య‌ర్థుల ఛ‌రీష్మా, గ‌త నాలుగున్న‌రేళ్లుగా వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కు వారు చేసిన సేవ‌లు, మ‌రికొన్ని చోట్ల కేసీఆర్ హ‌వా, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో అత్య‌ధిక ఓట‌ర్లు న‌మోదు అయి ఉండ‌డం మూలంగా ఇంత మొత్తం ఓట్లు తెచ్చుకోగ‌లిగారు. 


అయితే మొత్తం 26 స్థానాల‌లో ల‌క్ష‌కు పైగా ఓట్లు సాధించ‌గా హైద‌రాబాద్ లో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు అందులో 9 ఉండ‌డం గ‌మ‌నార్హం. వీటిని మిన‌హాయిస్తే మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాలు అన్నీ గ్రామీణ ప్రాంతాల‌లో ఉన్న‌వే. హైద‌రాబాద్ ను మిన‌హాయించి అత్య‌ధిక ఓట్లు సాధించిన వారి లెక్క తీస్తే మొద‌టి స్థానంలో హ‌రీష్ రావు ఉండ‌గా ఆరూరి ర‌మేష్, కేసీఆర్, కేటీఆర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌తీష్ కుమార్ వొడితెల‌, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, చిలుముల మ‌ద‌న్ రెడ్డి, ఈటెల రాజేంద‌ర్ త‌రువాతి  స్థానాల‌లో ఉండి టాప్ టెన్ లో చోటు ద‌క్కించుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా అత్య‌ధిక ఓట్లు సాధించిన‌ వారి వివ‌రాలు వ‌ర‌స‌గా

చామ‌కూర మ‌ల్లారెడ్డి - 167324 మేడ్చ‌ల్
కేపీ వివేకానంద - 154500 కుత్బుల్లాపూర్
అరికెపూడి గాంధీ - 143307 శేరిలింగంప‌ల్లి
త‌న్నీరు హ‌రీష్ రావు - 131295 సిద్దిపేట‌
ఆరూరి ర‌మేష్ - 131252 వ‌ర్ధ‌న్న‌పేట‌
కేసీఆర్ - 125444 గ‌జ్వేల్
కేటీఆర్ - 125213 సిరిసిల్ల‌
ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు - 117504 పాల‌కుర్తి
భేతి సుభాష్ రెడ్డి - 117442 ఉప్ప‌ల్
స‌తీష్ కుమార్ వొడితెల - 117083 హుస్నాబాద్
గూడెం మ‌హిపాల్ రెడ్డి - 116474 ప‌టాన్ చెరు
మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు - 114149 మ‌ల్కాజ్ గిరి
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి - 113980 ఎల్బీ న‌గ‌ర్
సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి - 111956 వ‌న‌ప‌ర్తి
మాధ‌వ‌రం కృష్ణారావు - 111612 కూక‌ట్ ప‌ల్లి
తోలుకంటి ప్ర‌కాష్ గౌడ్ - 108964 రాజేంద్ర‌న‌గ‌ర్
చ‌ల్లా ధ‌ర్మారెడ్డి - 105903 ప‌ర‌కాల‌
చిలుముల మ‌ద‌న్ రెడ్డి - 105665 న‌ర్సాపూర్
ఈటెల రాజేంద‌ర్ - 104840 హుజూరాబాద్ 
ఎం.సంజ‌య్ కుమార్ - 104247 జ‌గిత్యాల‌
క్రాంతికిర‌ణ్ చంటి - 104229 ఆంధోల్
అజ‌య్ కుమార్ పువ్వాడ - 102760 ఖ‌మ్మం
మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి - 102493 నాగ‌ర్ క‌ర్నూల్
వీఎం.అబ్ర‌హం - 102105 అలంపూర్
బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి - 100415 గ‌ద్వాల‌
సండ్ర వెంక‌ట‌వీర‌య్య - 100044 స‌త్తుప‌ల్లి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English