బాబు వ‌ల్లే ఓడాం...కాదు కాంగ్రెస్ వ‌ల్లే ఓడాం

బాబు వ‌ల్లే ఓడాం...కాదు కాంగ్రెస్ వ‌ల్లే ఓడాం

తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంపై కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్క‌టిగా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్య‌నేత‌లంతా త‌మ అభిప్రాయాల‌ను వినిపిస్తున్నారు. కొంద‌రు తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడును విమ‌ర్శిస్తుంటే...మ‌రికొంద‌రు..త‌మ సొంత పార్టీ తీరునే త‌ప్పుప‌డుతున్నారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి తాజాగా స్పందించారు.

మెదక్ జిల్లా నుండి తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు వద్దని తాను ముందే హెచ్చరించినట్లు చెప్పారు. పొత్తు వల్ల సోంత వ్యూహాలను సైతం పక్కన పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. పొత్తు వల్ల జరిగిన నష్టంపై పార్టీ హైకమాండ్ కు నివేదిక ఇస్తానని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికైనా తప్పులు దిద్దుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఎన్నికల్లో కొంత మంది కాంగ్రెస్ నాయకుల వల్లే ఓడిపోయాం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహాకూటమిగా తెలంగాణ ఎన్నికల్లో ముందుకుపోయామ‌ని, అయినా కూడా తాము ఓటమి చెందామ‌న్నారు. ఓట‌మికి చాలా బాధపడుతున్నామ‌ని, టీఆర్ఎస్ కంటే చాలా బాగా ప్రచారం చేసినా ఓడిపోయాం.. ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావట్లేదన్నారు. ఓడడానికి ఎన్నో కారణాలున్నా.. రాష్ట్ర అధిష్టానం అన్ని లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. మిగితా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఆనందంగా ఉందని ఆయ‌న తెలిపారు. అధికారం చేపట్టిన ఒక సంవత్సరంలో రాహుల్ ఇలాంటి విజయాలు సాధించడం మంచి పరిణామమ‌న్నారు.  మరిన్ని విజయాలు కూడా సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎవరైనా ఓటమికి తప్పని సరిగా బాధ్యత వహించాల్సిందే అని పొంగులేటి అన్నారు. రాహుల్ గాంధీని కలిసి చర్చిస్తా అని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English