అన్న‌లు ఓట‌మి...త‌మ్ముళ్ల గెలుపు

అన్న‌లు ఓట‌మి...త‌మ్ముళ్ల గెలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. తెలంగాణ ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుంచి నిలబడిన వారిలో తమ్ముళ్లు గెలుపొందగా.. అన్నలు ఓటమి చెందారు. టీఆర్ఎస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోగా, ఆయన తమ్ముడు నరేందర్ రెడ్డి గెలిచారు. నల్లగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరాజయం కాగా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అలాగే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన మల్లు రవి ఓటమి చెందగా తమ్ముడు భట్టి విక్రమార్క విజయం సాధించారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పట్నం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని రేవంత్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ చెప్పిన విషయం విదితమే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ప్రజల పక్షాన బాధ్యతయుతంగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే ఉప్పొంగిపోవడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి మాజీ మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఫలితాలు వన్‌సైడ్‌గా వస్తండటం చూసి తట్టుకోలేక బీపీ పెరగడంతో కింద పడిపోయినట్లు సమాచారం. ఆయనను వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. నల్గొండ నియోజకవర్గం నుంచి ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English