జానా, గీతా రెడ్డి, జీవ‌న్ రెడ్డిల‌కు షాక్!

జానా, గీతా రెడ్డి, జీవ‌న్ రెడ్డిల‌కు షాక్!

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత - మాజీ సీఎల్పీ లీడ‌ర్ జానా రెడ్డికి షాక్ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న బ‌రిలో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాల‌ట్లు, ప్రాథ‌మిక రౌండ్ల కౌంటింగ్ పూర్త‌య్యే స‌మ‌యానికి జానా రెడ్డి వెనుకంజ‌లో ఉన్నారు. జానాపై ఆయ‌న ప్ర‌త్య‌ర్థి - టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల న‌ర్సింహులు స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో ఉన్నారు.

జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కూడా వెనుకంజ‌లో ఉన్నారు. ఆమెపై టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆధిక్యంలో ఉన్నారు. మ‌రోవైపు - జ‌గిత్యాల‌లో పోటీ చేస్తున్న హ‌స్తం పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డికి కూడా షాక్ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న‌పై గులాబీ ద‌ళం అభ్య‌ర్థి సంజ‌య్ కుమార్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో ఉన్నారు.

జీవ‌న్ రెడ్డి వెనుకంజ‌లో ఉండ‌టంతో కేసీఆర్ కుమార్తె క‌విత ఖుషీఖుషీగా ఉన్నారు. త‌న తండ్రికి బ‌ద్ధ శ‌త్రువైన జీవ‌న్ రెడ్డిని ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఓడించాల‌ని క‌విత ముందు నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. సంజ‌య్ త‌ర‌ఫున ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English