ఫైన‌ల్ ఫ‌లితాన్ని చెప్పేసిన‌ పోస్ట‌ల్ బ్యాలెట్?

ఫైన‌ల్ ఫ‌లితాన్ని చెప్పేసిన‌ పోస్ట‌ల్ బ్యాలెట్?

నెల‌ల త‌ర‌బ‌డి సాగుతున్న‌ అంచ‌నాల్ని.. వాద‌న‌ల్ని మూట‌గ‌ట్టేసి ప‌క్క‌న పెట్టేసే టైమొచ్చింది. ప్ర‌జాతీర్పు ఏమిట‌న్నది ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైన వేళ‌.. పోలింగ్ ప్ర‌క్రియ షురూ అయ్యింది. ఎప్ప‌టిమాదిరే తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్క క‌ట్ట‌టం.. దాని ఫ‌లితాలు చూసిన‌ప్పుడు తెలంగాణ వ‌ర‌కూ చూస్తే.. ఇవాల్టి హీరో ఎవ‌రో అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

కేసీఆర్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మ‌స్తుగా ఉంద‌ని.. ప్ర‌భుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా సాగుతున్న చ‌ర్చ‌ల‌కు భిన్నంగా పోస్ట‌ల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ కు స్ప‌ష్ట‌మైన అధిక్య‌త క‌నిపించిన నేప‌థ్యంలో.. తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న సంకేతాలు చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. పోస్ట‌ల్ బ్యాలెట్ కు సంబంధించి 42 నియోజ‌క‌వ‌ర్గాల్లో 334 చోట్ల టీఆర్ఎస్ అధిక్య‌త‌లో ఉండ‌గా.. కాంగ్రెస్ 6 చోట్ల.. బీజేపీ ఒక‌చోట‌.. ఇత‌రులు ఒక చోట‌ అధిక్య‌త‌లో ఉన్నట్లుగా టీవీ ఛాన‌ళ్లు చూపిస్తున్నాయి. వీటికి సంబంధించి కొన్ని ఛాన‌ల్స్ లో ఒక‌లా.. మ‌రికొన్ని ఛాన‌ల్స్ లో మ‌రోలా క‌నిపించినా.. కామ‌న్ గా క‌నిపించింది మాత్రం టీఆర్ఎస్ అధిక్య‌త‌లో ఉంద‌నేదే.

కేసీఆర్ ప్ర‌భుత్వం మీద ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పీక‌ల‌దాకా కోపం ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. ఓట్లు మాత్రం అందుకు భిన్నంగా ప‌డ‌టం చూస్తుంటే.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌చ్ఛితంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌న్న న‌మ్మ‌కం క‌లుగ‌క మాన‌దు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమంటే.. టీఆర్ఎస్ కు అధిక ఓట్లు.. త‌ర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉండ‌గా.. బీజేపీకి సైతం పోటాపోటీగా ఓట్ల‌ను తెచ్చుకున్న వైనం క‌నిపిస్తుంది. ఈసారి ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన బీజేపీ త‌న బ‌లాన్ని స్ప‌ష్టంగా చాటి చెప్పిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. సో.. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా టీఆర్ఎస్ అడుగులు వేస్తుంద‌న్న విష‌యం పోస్ట‌ల్ బ్యాలెట్ సంకేతాలు ఇచ్చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English