జేజెమ్మకే హోమ్‌ పీఠం

జేజెమ్మకే హోమ్‌ పీఠం

గద్వాల్‌ జేజెమ్మ డికె అరుణకే హోంమంత్రి పదవి దక్కనుందంట. హోంమంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయగా, అది ఆమోదం పొందగా వీలైనంత త్వరగా ఆ పదవిలో ఇంకొకర్ని కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పదవి అంత కీలకమైనది.

తెలంగాణ వారికే హోంమంత్రి పదవి దక్కుతుంది. మహిళకే ఆ పదవి ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం కూడా భావిస్తున్నదంట. పైగా సబిత సామాజిక వర్గానికే హోంమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాజకీయ సమీకరణాలను సరిపెట్టాలని చూస్తున్న కాంగ్రెసు అధిష్టానం మంత్రి డికె అరుణకు ఇప్పటికే సమాచారం అందించినట్లుగా తెలుస్తున్నది. సబితా ఇంద్రారెడ్డిలా డికె అరుణ సాఫ్ట్‌ కాదు.

హోంమంత్రులుగా ఉండాలంటే సాఫ్ట్‌ నేచర్‌ తప్పనిసరని కాంగ్రెస్‌ ఆలోచన. కాని అన్ని సమీకరణాలూ చూసుకుంటే డికె అరుణకే ఆ పదవి దక్కనున్నదని కాంగ్రెసులోనే ఎక్కువమంది అభిప్రాయం. ఏదేమైనా కొత్త హోంమంత్రి ఎవరనేదానిపై వీలైనంత త్వరగా సస్పెన్స్‌కి తెరదించాల్సి ఉన్నది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు