పాదయాత్రతో నష్టమా? లాభమా?

పాదయాత్రతో నష్టమా? లాభమా?

చంద్రబాబు పాదయాత్ర ముగిసింది. 200 రోజులకు పైగా సాగిన పాదయాత్ర ముగిశాక, చంద్రబాబు సొంత ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నారు, రెస్ట్‌ తీసుకుంటూ లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నార్ట. సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచిన చంద్రబాబు, తన పాదయాత్ర సమయంలో ఎంతమంది నేతలను కోల్పోయిందీ లెక్కలు వేసుకుంటున్నారని వినికిడి. దురదృష్టవశాత్తూ ఎర్రన్నాయుడు, శ్రీపతి రాజేశ్వర్‌ లాంటి నేతలు మరణించగా, పార్టీని వీడిన నేతల సంఖ్య చాలా ఎక్కువ.

 పాత రక్తం పోయిందని సర్ది చెప్పుకుందామనుకున్నా అది సాధ్యం కావడంలేదట ఆయనకు. దీనికి తోడు, తన పాదయాత్ర జరుగుతున్న చోట్ల తెలుగు తమ్ముళ్ళు కొట్లాటలకు దిగడం, ఆధిపత్య పోరు ప్రదర్శించడం వంటివి జ్ఞప్తికి తెచ్చుకుని, ఆ వివాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నార్ట. పాదయాత్ర శారీరక శ్రమ, అది పూర్తయ్యాక మానసిక శ్రమ. ఇంత కష్టపడ్డా లాభం లేదనే ఆవేదన చంద్రబాబుని మానసికంగా చాలా కష్టపెడుతున్నదంట.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English