ఆ హీరో హన్సికని పడేశాడా?

ఆ హీరో హన్సికని పడేశాడా?

కోలీవుడ్‌లో అతడిని 'మన్మథ' అని పిలుస్తుంటారు. తనతో నటించే హీరోయిన్లని ఆకర్షించి వారితో అఫైర్లు సాగించడంలో దిట్ట. అందుకేనేమో 'మన్మథ' అనే పేరుతో తనే ఓ సినిమా కూడా చేసేశాడు. అయితే ఏ హీరోయిన్‌తో అయినా షార్ట్‌ టర్మ్‌ రిలేషన్స్‌ తప్ప సీరియస్‌ రిలేషన్‌ పెట్టుకోలేదు. నయనతారతో మాత్రం అతని లవ్‌ చాలా కాలం పాటు సాగింది. ఆ వ్యవహారం ఎంత రచ్చ అయిందో కూడా తెలిసిందే. ఇప్పుడు శింబు ప్రేమలో హన్సిక పడిందని, అతనితో అందుకే వెంటవెంటనే రెండు సినిమాలు సైన్‌ చేసిందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే హన్సిక మాత్రం ఈ పుకార్లని ఖండించింది. తానెవరితోను ప్రేమలో పడలేదని, వరుసగా రెండు సినిమాలు సైన్‌ చేస్తే ఇక ఏదో ఉన్నట్టేనా అంటూ మండి పడింది. ఇలాంటి పుకార్లు పుట్టించే మీడియా వారు నిజానిజాలు తెలుసుకోవాలని, ఇలాంటి వాటి వల్ల అవసరం లేని తలనొప్పులు, సమస్యలు తమకి వస్తాయని, నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి ప్రచారం చేయవద్దని కోరింది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు