హ‌రీశ్ మ‌రో కుమార‌స్వామి అవుతారా?

హ‌రీశ్ మ‌రో కుమార‌స్వామి అవుతారా?

తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. టీఆర్ఎస్ మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా? లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జాకూట‌మి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. హంగ్ వ‌చ్చే అవ‌కాశాల‌నూ కొట్టిపారేయ‌లేమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

టీఆర్ఎస్‌కుగానీ లేక ప్ర‌జా కూట‌మికిగానీ సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు వ‌స్తే స‌రేస‌రి. ఎలాంటి చిక్కులు ఉండ‌వు. అలా కాకుండా హంగ్ వ‌స్తే రాష్ట్రంలో ప‌రిస్థితులు ఎలా ఉండ‌బోతోందనే అంశంపై భిన్న ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. వాటిలో జ‌నం దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తున్న విష‌యాలు రెండు. హ‌రీశ్ రావు మ‌రో కుమార‌స్వామి అవుతారా? గులాబీ పార్టీని చీల్చి ఆయ‌న సీఎం పీఠం ఎక్కుతారా?

కేసీఆర్ ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌ని ప్ర‌జాకూట‌మి ప‌ట్టుద‌ల‌తో ఉంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌. అందుకే ఈ ఎన్నిక‌ల్లో ఒక‌వేళ త‌మ‌కు మెజారిటీ స్థానాలు ద‌క్క‌కున్నా.. కేసీఆర్ కు సీఎం కుర్చీని ఎలా దూరం చేయాల‌న్న‌దానిపై కూట‌మి నేత‌లు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా హ‌రీశ్ రావుపై వారు ప్ర‌ధానంగా దృష్టిపెట్టార‌ట‌.

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో అత్యంత క్రియాశీల‌కంగా ఉన్నారు. కేటీఆరే త‌న వార‌సుడ‌ని ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పారు. పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు గానీ - కేసీఆర్ త‌ర్వాత సీఎం పీఠం గానీ కేటీఆర్ కు ద‌క్కే అవ‌కాశాలే మెండు. ఇదే విష‌యాన్ని హ‌రీశ్‌కు బ‌లంగా నూరిపోయాల‌ని కూట‌మిలోని కొంద‌రు నేత‌లు భావిస్తున్నార‌ట‌.

క‌ర్ణాట‌క‌లో కేవ‌లం 37 సీట్లు సీట్లు గెల్చుకున్న జేడీఎస్ నేత కుమార‌స్వామి ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. అవ‌స‌ర‌మైతే అదే త‌ర‌హాలో హ‌రీశ్ ను సీఎం చేయాల‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నార‌ట‌. టీఆర్ఎస్‌ను చీల్చి త‌నకు మ‌ద్ద‌తుగా ఉన్న ఎమ్మెల్యేల‌తో హ‌రీశ్ బ‌య‌ట‌కు వ‌స్తే ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి పీఠం అప్ప‌గించాల‌ని యోచిస్తున్నార‌ట‌. మంగ‌ళ‌వారం నాటి ఎన్నిక‌ల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగ‌ర్ ను అందుకోలేక‌పోతే ప్ర‌జాకూట‌మి నేత‌లు వెంట‌నే ఈ మేర‌కు హ‌రీశ్‌కు గాలం వేసే ప‌నుల‌ను ప్రారంభించే అవ‌కాశ‌ముంద‌ట‌. చూద్దాం ఏం జ‌రుగుతుందో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English