జ‌గ‌న్ గూటికి సీనియ‌ర్ నేత‌, బాల‌య్య‌కు షాక్

జ‌గ‌న్ గూటికి సీనియ‌ర్ నేత‌, బాల‌య్య‌కు షాక్

తెలుగుదేశానికి చెందిన ఓ ముస్లింనేత‌, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అది కూడా చంద్ర‌బాబు బావ‌మ‌రిది, హిందూపురం ఎమ్మెల్యే బాలక‌ృష్ణ నియోజకవర్గంలో కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. టీడీపీ కీలక నాయకుడు, హిందూపురం మాజీ ఎమ్యెల్యే అబ్దుల్ ఘని పార్టీని వీడారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఈ రాజీనామా క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

టీడీపీ సీనియ‌ర్ నేత అయిన అబ్దుల్‌ఘ‌నీ 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హ‌వా సాగుతున్న‌ప్ప‌టికీ విజయదుంధుభి మోగించారు. కాగా, గత 2014 ఎన్నికల్లో మాత్రం బాలయ్య కోసం అబ్దుల్ ఘనీ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ సమ‌యంలో పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు అనేక హామీలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే, బాల‌య్య గెలిచిన అనంత‌రం త‌న‌కు త‌గినంత ప్రాధాన్యం లేద‌ని ఘ‌నీ భావిస్తున్నార‌ట‌.   పార్టీ అధిష్టానం తీరుపై ఘనీ అసంతృప్తికి లోనయినట్లు సమాచారం. దీనితో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
 
తాజాగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వైసీపీ కండువా కప్పుకున్నారు. డిసెంబర్ 8వ తేదీ శనివారం సిక్కోలు జిల్లాల్లొని కేసవరావుపేట వద్ద వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే, మ‌ళ్లీ ఈసారి కూడా బాల‌య్య పోటీ చేస్తే త‌న‌కు ఇంకోసారి కూడా టిక్కెట్ రాద‌నే ఉద్దేశంతోనే అతని పార్టీ వీడుతున్న‌ట్లు తెలుగుదేశం వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీ అత‌నికి చాలా ప్రాధాన్యం ఇచ్చినా కేవ‌లం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వైసీపీలో చేరార‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English