పోలింగ్ రోజు సెల‌వు లేదు.. చేతులు కోసుకున్న విద్యార్థులు

పోలింగ్ రోజు సెల‌వు లేదు.. చేతులు కోసుకున్న విద్యార్థులు

ఎన్నికల పండగ రావడంతో.. నగరవాసులంతా.. సొంత ఊళ్లకు బయల్దేరారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు… ఎంత బిజీగా ఉన్నా.. అన్ని పనులు పక్కనబెట్టి.. పల్లె బాట పట్టారు. దీంతో.. హైదరాబాద్ లోని అన్ని బస్టాండ్లలో ఫుల్ రష్ కనిపించింది. ప్రయాణికుల కోసం.. స్పెషల్ బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ శుక్రవారం రోజు కావడం.. తర్వాత శని, ఆదివారాలు వీకెండ్ కావటంతో.. నగరంలో నివసిస్తున్న పల్లె ఓటర్లంతా వీకెండ్ ప్లాన్ తో ఊళ్లకు వెళ్తున్నారు. ఓటు వేయడంతో పాటు ఊళ్లో బంధువులందరినీ కలిసి మజా చేయాలని ఫిక్సయ్యారు. ఫ్యామిలీ అంతా కలిసి.. పట్నం వీడి పల్లె బాట పట్టారు.

అయితే, ఇదే స‌మ‌యంలో ఓ గోరం చోటుచేసుకుంది. ఎన్నికల వేళ అన్ని ప్రైవేటు, ప్రభుత్వం సంస్థలకు సెలువులు ఇచ్చారని.. తమకు మాత్రం ఇవ్వలేదంటూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు తీవ్రంగా నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా నాగోల్  బ్రాంచ్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు తమకు ఔటింగ్ ఇవ్వలేదన్న మనస్తాపంతో చేతులను కోసుకున్నారు. ఆరుగురు విద్యార్థినిలు తమ చేతులు కోసుకోవడంతో.. దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించి కాలేజీ యాజమాన్యం చికిత్స అందిస్తోంది. ఎన్నికలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ.. తమకు కనీసం ఒక్కరోజు కూడా ఔటింగ్ ఇవ్వకుండా హాస్టల్ లోనే ఉంచడంపై వారు నిరసన తెలుపుతూ… ఓ వాయిస్ రికార్డ్ చేశారు. తమ కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు ఆ వాయిస్ ను పంపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English