బాబుకు చివ‌రినిమిషంలో వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌

బాబుకు చివ‌రినిమిషంలో వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌

కూట‌మిలో ఐక్య‌త ఎంత ఎండ‌మావో మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. మ‌రోమారు తెలంగాణ‌లోని పార్టీలు క‌ట్టిన దోస్తీలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు షాక్ త‌గిలింది. త‌న మార్క్ రాజ‌కీయం ఎలా ఉంటుందో కాంగ్రెస్ రుచి చూపించింది. పోలింగ్‌కు కొన్ని గంట‌ల ముందు టీడీపీ అభ్య‌ర్థిని నిలిపిన చోట త‌మ పార్టీ రెబ‌ల్ అభ్య‌ర్థి కోస‌మే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప‌నిచేయాల‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ క‌లిసి కూట‌మి క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సీట్ల పంప‌కం నుంచి మొద‌లుకొని నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌న్న పాత్ర పోషించింది. ఈ ద‌శ‌లోనే ఆయా పార్టీల్లో ఎన్నో లుక‌లుక‌లు, అసంతృప్తులు, ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కొంద‌రు పార్టీని వీడారు. ఇంకొంద‌రు దుమ్మెత్తిపోశారు. ఇదంతా స‌ద్దుమ‌ణిగి పోలింగ్ స‌మీపిస్తున్న ద‌శ‌లో టీపీసీసీ త‌ర‌ఫున కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించిన ఇబ్ర‌హీంప‌ట్నంలో బ‌రిలో ఉన్న టీడీపీ అభ్య‌ర్థికి కాకుండా కాంగ్రెస్ రెబ‌ల్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారిక పీఆర్ఓ ఈ మేర‌కు మీడియాకు స‌మాచారం ఇచ్చారు. ``ఇబ్రహీంపట్నం అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ కూటమి మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మల్‌ రెడ్డి రంగారెడ్డి కె మద్దతు ఇచ్చి పనిచేయాలి`` అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. కాగా, ఈ ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న సామ‌రంగారెడ్డి షాక్‌కు లోన‌వ‌గా, బీఎస్పీ నుంచి బ‌రిలో ఉన్న కాంగ్రెస్ రెబ‌ల్ మ‌ల్రెడ్డి రంగారెడ్డి ఖుష్ అవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English