కేసీఆర్ ఓటమి గురించి మీకు తెలుసా?

కేసీఆర్ ఓటమి గురించి మీకు తెలుసా?

కె. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఏ ఎన్నిక‌ల్లో అయినా మెజారిటీ గురించే త‌ప్ప ఓట‌మి స‌మ‌స్యే లేద‌ని అంద‌రూ భావించే వ్య‌క్తి. తెలంగాణ ముఖ్య‌మంత్రి. మాట‌తో ఎవరినైనా మురిపించ‌గ‌లిగిన వక్త‌. కానీ... ఆయ‌న దారుణంగా ఓడిపోయిన విష‌యం మీకు తెలుసా? అవును ఇది నిజ‌మే.

కేసీఆర్ త‌ల్లిదండ్రుల‌ది ఎగువ మానేరు డ్యాం నిర్వాసిత కుటుంబం. చింత‌ల‌మడ‌క గ్రామంలో స్థిర‌ప‌డ్డారు. త‌ల్లిదండ్రులు. అత‌ను సిద్ధిపేట‌లో బీఏ, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఎం.ఏ తెలుగు చేశారు. విద్యార్థి స‌మ‌యంలో కాలేజీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి తొలి ఓట‌మి మూట గ‌ట్టుక‌న్నారు. అనంత‌రం తొలి ద‌శ తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు, కాంగ్రెస్ నేత అయిన అనంతుల మ‌ద‌న్‌మోహ‌న్ శిష్యుడుగా కొంతకాలం ఉన్నారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ పిలుపుతో 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. చిత్రం ఏంటంటే... ఆయ‌న ప్ర‌త్య‌ర్థి ఆయ‌న గురువు అయిన అనంతుల మ‌ద‌న్ మోహ‌న్.

ట్విస్ట్ ఏంటంటే... అనంతుల మ‌ద‌న్‌మోహ‌న్ పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి కాదు. *తెలంగాణ ప్ర‌జా స‌మితి* అనే పార్టీ ఇత‌రుల‌తో క‌లిసి పెట్టారు. దానికి అధ్య‌క్షుడు ఆయ‌నే. ఆ పార్టీ నుంచే 1983లో సిద్ధిపేట‌లో పోటీచేశారు. ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నంలా గెలిచిన ఆ ఎన్నిక‌లో కేసీఆర్ దారుణంగా ఓడిపోయారు. ఇపుడు ఆ నియోజ‌క‌వ‌ర్గం హ‌రీష్‌రావుది. కేసీఆర్‌తో పోలిస్తే హ‌రీష్ రావు వ‌చ్చాకే ఆ నియోజ‌క‌వ‌ర్గం ద‌శ తిరిగింది.

విచిత్ర‌మేంటంటే... ఆ త‌ర్వాత ఇన్నాళ్లు దాదాపు అలాంటి పేరున్న‌ పార్టీయే ఇపుడు కేసీఆర్‌కు ప్ర‌త్య‌ర్థి. అది కోదండ‌రాం అధ్య‌క్ష‌త‌న న‌డిచే *తెలంగాణ జ‌న స‌మితి*. మ‌రి ఆరోజు తెలంగాణ ప్ర‌జా స‌మితి చేతిలో ఓడిపోయిన కేసీఆర్ పై ఇపుడు తెలంగాణ జ‌న‌ స‌మితి ప్రభావం ఉంటుందా? ఉండ‌దా? వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English