కేసీఆర్ కోసం నాలుక కోసుకున్న ఏపీ యువ‌కుడు

కేసీఆర్ కోసం నాలుక కోసుకున్న ఏపీ యువ‌కుడు

ఆంధ్రా రాజ‌కీయాల్లో వేలు పెడ‌తామంటూ టీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ఇటీవ‌ల సంచ‌లన‌ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట‌ల‌ను చాలామంది స్వాగ‌తించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌వేశించి చంద్ర‌బాబునాయుడికి బుద్ధి చెప్పాల‌ని టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించాయి.

మ‌రి కేటీఆర్ నిజంగా టీఆర్ఎస్‌ను ఏపీకి తీసుకెళ్తారో లేదో తెలియ‌దుగానీ.. వెళ్తే మాత్రం క‌చ్చితంగా మంచి ఆద‌ర‌ణ ఉండేట‌ట్లే క‌నిపిస్తోంది. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. ఏపీ ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్‌పై - కేసీఆర్‌పై ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని చెప్పేందుకు హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం మండ‌లం గూటాల గ్రామానికి చెందిన చేవెళ్ల మ‌హేశ్ కొంత‌కాలంగా హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్నాడు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం అత‌డు శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి వెళ్లాడు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారం రావాల‌ని.. కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాల‌ని ఆకాంక్షించాడు. గ‌ట్టిగా అరుస్తూ త‌న ఆకాంక్ష‌ను బ‌య‌ట‌కు చెప్పాడు. అనంత‌రం బ్లేడుతో తన నాలుక‌ను కోసుకున్నాడు. తెగిన కొంత నాలుక భాగాన్ని హుండీలో వేశాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు మ‌హేశ్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. గ‌తంలో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని కూడా మ‌హేశ్ నాలుక కోసుకున్న‌ట్లు తెలిసింది. ఆంధ్ర‌ప్రదేశ్‌లో జ‌గ‌న్ సీఎం కావాలంటూ రాసి ఉన్న ఓ లేఖ తాజాగా మ‌హేశ్ జేబులో దొరికింద‌ని పోలీసుల వెల్ల‌డించారు.

ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం అలుపెరుగ‌ని పోరాటం చేసిన యోధుడిగా ఏపీలో కొన్నివ‌ర్గాలు కేసీఆర్‌ను గౌర‌విస్తాయి. అప‌ర భ‌గీర‌థుడిగా ఆయ‌న్ను అభివ‌ర్ణిస్తుంటాయి. ఇటీవ‌లే ఓ యువ‌కుడు ఏపీ నుంచి కాలిన‌డక‌న వ‌చ్చి హైద‌రాబాద్‌లో కేటీఆర్‌ను క‌లిశాడు. టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న త‌న ఆకాంక్ష‌ను వెలిబుచ్చాడు.
ఇప్పుడు మ‌రో ఆంధ్రా యువ‌కుడు కేసీఆర్ కోసం ఏకంగా నాలుక కోసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ ప‌రిస్థితులు చూస్తుంటే టీఆర్ఎస్ ఆంధ్రా రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తే మంచి ఫ‌లితాలు ద‌క్క‌వ‌చ్చున‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English