ల‌గ‌డ‌పాటి కేటీఆర్ ర‌హ‌స్య సంబంధాలు ఎందుకు?

ల‌గ‌డ‌పాటి కేటీఆర్ ర‌హ‌స్య సంబంధాలు ఎందుకు?

మేము గెలిస్తే తెలంగాణ గెలిచిన‌ట్లే అని పొద్దుగాల నుంచి ఒకటే అబ‌ద్ధాలు చెప్పే ఈ తండ్రీకొడుకుల ఫ్రెండ్షిప్‌లు, పార్టీలు అని తెలంగాణ‌ను అడ్డుకోవ‌డానికి చివ‌ర‌కు ప్ర‌య‌త్నించిన ద్రోహుల‌తో ఫ్రెండ్షిప్ చేస్తారా? మీరుంటే తెలంగాణ ముందుకు పోదు, వెన‌క్కు పోతుంది అని రేవంత్ రెడ్డి కేటీఆర్‌, కేసీఆర్‌ల‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు.

ల‌గ‌డ‌పాటి ఎవ‌రో తెలంగాణ ప్రజ‌ల‌కు తెలియ‌దా? తెలంగాణ బిల్లు పెట్టిన‌పుడు పార్ల‌మెంటును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది ల‌గ‌డ‌పాటి కాదా? ఏకంగా స‌మైక్యాంధ్ర కోసం రాజ‌కీయ త్యాగం చేసినంత‌టి క‌ర‌డుగ‌ట్టిన ఆంధ్రుడితో కేటీఆర్ ఎందుకు ర‌హ‌స్య సంబంధాలు నెర‌పుతున్నారో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

కేసీఆర్‌-కేటీఆర్ చుట్టూ ఉన్న‌ది ఆంధ్రోళ్లే, వాళ్ల పార్ట‌న‌ర్స్ ఆంధ్రోళ్లే. వాళ్లు వ్యాపారాలు చేసేది ఆంధ్రోళ్ల‌తోనే అని రేవంత‌ల్ రెడ్డి ఆరోపించారు. అయితే ఆయ‌న ఈ ఆరోప‌ణ‌లు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో చ‌శారు.

నిన్నటి ఎపిసోడ్‌తో ప్ర‌భుత్వ త‌న నిరంకుశ పోక‌డ‌లు ఓటింగ్‌కు ముందు ప్ర‌జ‌ల‌కు గుర్తుచేసి మంచి ప‌ని చేసింద‌ని రేవంత్ కొడంగ‌ల్ స‌భ‌లో వ్యాఖ్యానించారు. నా గురించి మాట్లాడే ద‌మ్ము, నాక‌ళ్ల‌లోకి చూసే ధైర్యం కూడా ఈ తండ్రీకొడుకుల‌కు లేవ‌ని రేవంత్ అన్నారు. రైతులు ఎవ‌రూ రుణాలు కట్టొద్ద‌ని... ప్ర‌జాకూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, మీ రుణాల‌న్నీ చెల్లిస్తుంద‌ని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు వంద అడుగుల గోతిలో పాతిపెట్టే రోజులు ఎంతోదూరంలో లేవని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English