చంద్ర‌బాబును వ‌దులుకోవ‌ద్ద‌న్నా... వాళ్లు విన‌లేదు

చంద్ర‌బాబును వ‌దులుకోవ‌ద్ద‌న్నా... వాళ్లు విన‌లేదు

కేటీఆర్ ట్వీట్లతో హ‌ర్ట్ అయిన ల‌గ‌డ‌పాటి ఉద‌యం ప్రెస్‌మీట్ పెట్టి...కేటీఆర్ ను నిల‌దీశారు. నిజం చేదుగా ఉన్నా, తియ్య‌గా ఉన్నా భ‌రించ‌డం నేర్చుకున్న వ్య‌క్తే లీడ‌ర‌ని కేటీఆర్‌కు సూచించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ఒక వ్యాఖ్య చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

 చంద్రబాబును వదులుకోవద్దు.  టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని కేటీఆర్‌కు చెప్పాను. అయితే, లేదు మేము సింగిల్‌గా వెళ్ల‌డానికే సిద్ధ‌మ‌య్యాయ‌ని చెప్పారు. క‌చ్చితంగా అది న‌ష్టం చేస్తుంద‌ని, చంద్ర‌బాబుతో క‌ల‌వ‌డం టీఆర్ఎస్‌కే లాభ‌మ‌ని కేటీఆర్‌కు మ‌రీమ‌రీ చెప్పాన‌ని ల‌గ‌డ‌పాటి అన్నారు.

ఇప్ప‌టికీ తెలుగుదేశం క్యాడ‌ర్ తెలంగాణ‌లో చాలావ‌ర‌కు ఉంద‌ని, అది పార్టీకి ఉప‌యోగ‌డుతుంద‌ని, టీడీపీతో క‌లిస్తే లాభం టీఆర్ఎస్‌కే ఎక్కువ‌ని చెప్పిన‌ట్లు ల‌గ‌డ‌పాటి వివ‌రించారు.

కాంగ్రెస్ వైపు బాబు మొగ్గుతున్న‌పుడు మ‌రోసారి చెప్పాను. వీలుంటే పొత్తులతో వెళ్లాలని కేటీఆర్‌కు సలహా ఇచ్చాను. వారు ప‌ట్టించుకోలేదు. సింగిల్‌గా వెళ్ల‌డానికే నిర్ణ‌యించుకున్నార‌ని ల‌గ‌డ‌పాటి తెలిపారు. నాలుగు పార్టీలు క‌లిస్తే పోటాపోటీగా ఉంటుందని హెచ్చ‌రించాన‌ని లగడపాటి వివరించారు.

65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ఆ విష‌యం చెప్పినా ప‌ట్టించుకోలేద‌న్నారు. కేటీఆర్‌ 23 నియోజకవర్గాలపై స‌ర్వే అడిగారు. వాటితో పాటు ఇంకొన్నిటిలో కూడా చేశాను. ఆయ‌న కోరిన చోట్ల కాంగ్రెస్ వైపే ప్ర‌జ‌లు ఉన్నారు.  "మీ నాన్న గారు పాడు చేసిన వాతావరణాన్ని.. మీరు బాగు చేశారని కేటీఆర్‌కు మెసేజ్‌ చేశా" అని ల‌గ‌డ‌పాటి వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English