నోరు మంచిదైదే... ఓటర్లూ మంచివారే !

నోరు మంచిదైదే... ఓటర్లూ మంచివారే !

నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఓ సామెత. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఇది కాస్త మారింది. నోరు మంచిదైతే ఓటర్లు మంచివారే అవుతారు అంటున్నారు.

ఎందుకంటారా.... తెలంగాణకు ముందస్తు ఎన్నికల ప్రకటించిన సమయంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి విజయం నల్లేరు మీద నడకే అని అందరూ అనుకున్నారు. ఈ దీమాతోనే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించి తమ విజయం పట్ల దీమాను ప్రకటించారు.

దీనికి తోడు ముందస్తు ఎన్నికలు ప్రకటించే సమయానికి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత పరిణామాలలో అన్ని పార్టీలు కలిసి ప్ర‌జాకూటమిగా ఏర్పడే అవకాశాలు కూడా కనిపించలేదు.

ఇన్ని సానుకూల అంశాలు తన ముందు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఇక గెలుపు తనదే అని భావించారు. ఈ దీమాతోనే తొలుత నిర్వహించిన ప్రచార సభల్లో చాలా దూకుడు ప్రదర్శించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీని, దాని అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ్ని అస్త్రంగా చేసుకుని తీవ్ర స్ధాయిలో మాట్లాడారు. 

ప్రచార సభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిట్ల దండకాన్ని ఆ పార్టీ నాయకులు, మీడియా కూడా దూకుడు ప్రసంగాలుగానే అభివర్ణించారు. దీంతో కల్వకుంట్ల వారు కూడా తన ప్రసంగాలలో రెచ్చిపోయారు. అయితే ఇది బూమ్ రాంగ్ అయ్యిందంటున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడి మీద నోరు చేసుకోవడం ఎక్కువైందో అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ప్రారంభమయ్యింది.

నాలుగైదు సభల తర్వాత ఈ అంశాన్ని గుర్తించిన కేసీఆర్, ఇతర మంత్రులు, నాయకులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సీమాంధ్రులను బుజ్జగించే పని ప్రారంభించారు. తామూ చంద్రబాబుకే శత్రువులం కాని సీమాంధ్రులకు కాదని నమ్మబలికారు. అయినా సెటిలర్ల నుంచి ఆశించిన స్ధాయిలో సానుకూలత రాలేదని అంటున్నారు. దీని ప్రభావం ఓటింగ్‌నాడు గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అది ఇప్ప‌టికే స‌ర్వేల‌లో తేట‌తెల్ల‌మైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English