లోకేష్ లో ఇంత మార్పా?!

లోకేష్ లో ఇంత మార్పా?!

మొన్నటి వరకూ ఆయన మాట్లాడడం రాని మంత్రి..... మొన్నటి వరకూ వర్దంతికి, జయంతికి తేడా తెలియని రాజకీయ నాయకుడు...  అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. సెటైర్లు, కౌంటర్లు, మాటల తూటాలు పేలుస్తున్న మంత్రి. ఔరా... ఎంతలో ఎంత తేడా అని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ ఎవరి గురించి అనుకుంటున్నరా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గురించే. ఇంతకు ముందు నారా లోకేష్ ఏం మాట్లాడిన అందులో పనికొచ్చేది ఏదీ లేదనేవారు. అంతేకాదు ఆయన భాష వ‌ల్ల‌ తెలుగుదేశం నాయకులు తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం పరిస్దితి పూర్తిగా మారిపోయింది. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై వేసిన కౌంటర్లే నిదర్శనం.  

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్ర‌జా కూటమిలో భాగస్వామి అయ్యింది. దీంతో ప్ర‌జా కూటమి విజయంలో భాగంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. ఇది గిట్టని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చంద్రబాబుకు ఇక్కడేం పని అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ మంత్రి కె. తారక రామారావు అయితే చంద్రబాబు ఇక్కడకి వచ్చాడు కాబట్టి తామూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో వేలు పెడతామని ప్రకటించారు. ఈ ప్రకటనకు తెలుగుదేశం నాయకులు ఒక్కక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. "అక్కడకొస్తారా.... రండి చూసుకుందాం" అని బాలక్రిష్ణ ఛాలెంజ్ చేసారు. మరో మంత్రి "రండి చూసుకుందా....మీ పతాపం మా పతాపం" అని అన్నారు.

అయితే నారా లోకేష్ మాత్రం" మా రాష్ట్రానికి రండి. మీలాగ మా దగ్గర అక్రమ అరెస్టులు ఉండవు, రౌడీయిజం ఉండదు, అభ్యర్థులను బెదిరించడం ఉండదు" అని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి అరెస్టుపై లోకేష్ స్పందిచిన తీరు ఇది. ఈ ఒక్క సెటైర్‌తో తనకు ఏమీ తెలియదు అన్న వారి నోరు మూత పడేలా చేసారు లోకేష్. ఇందుకే లోకేష్‌ని ఆంధ్రులందరూ శభాష్ అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English