కేటీఆర్ - ల‌గ‌డ‌పాటి వార్ - లాజిక్ మిస్‌

కేటీఆర్ - ల‌గ‌డ‌పాటి వార్ - లాజిక్ మిస్‌

మంగ‌ళ‌వారం హాట్‌హాట్‌. తెలంగాణ, ఆంధ్ర హైటెన్ష‌న్లో ఉన్నాయి. పొద్దున రేవంత్ అరెస్ట్‌. మ‌ధ్యాహ్నం హైకోర్టు సీరియ‌స్‌, సాయంత్రం ల‌గ‌డ‌పాటి స‌ర్వే... బ్యాక్ టు బ్యాక్ దెబ్బ‌లతో టీఆర్ఎస్ టీం విల‌విలలాడింది. ఈ  ఫ్ర‌స్ట్రేష‌న్లో కేసీఆర్ అండ్ కేటీఆర్ త‌ప్పుల మీద త‌ప్పులు చేశారు. నిన్న ఒక్క‌రోజే టీఆర్ఎస్‌కు జ‌రిగిన డ్యామేజ్ అంతా ఇంతాకాదు.

నిన్న 7 గంట‌ల‌కు ల‌గ‌డ‌పాటి ప్రెస్ మీట్ పెట్టాడు. తెలంగాణ ఫ‌లితాల‌ను నెంబ‌ర్లు చెప్ప‌కుండా వివ‌రాలు వెల్ల‌డించాడు. కొన్ని నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఆయ‌న ఎక్కువ వివ‌రాల‌ను విపులీక‌రించ‌లేదు. ఆ స‌ర్వే ప్ర‌కారం టీఆర్ఎస్ ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం నెల‌కొల్పే అవ‌కాశం లేదు అన్న‌ది సారాంశం. ఇది టీఆర్ఎస్ కు చాలా కోపం తెప్పించింది. దీంతో కేటీఆర్ తీవ్రంగా మ‌ద‌న‌ప‌డి రాత్రి 10 గంట‌ల త‌ర్వాత ల‌గ‌డ‌పాటి నాకు మా పార్టీ వ‌స్తుంద‌ని చెప్పాడు. ఇపుడేమో సీబీఎన్ ఒత్తిడితో నెంబ‌ర్లు మార్చాడు అన్నారు. జ‌నం న‌మ్మ‌డానికి ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు.

ఇక్క‌డే లాజిక్ మిస్స‌యింది.

ల‌గ‌డ‌పాటి ప్రెస్ మీట్ జ‌రిగింది - రాత్రి 7 గంట‌ల‌కు
కేటీఆర్‌ స్క్రీన్ షాట్ లో టైం - 4.19 గంట‌లు
కేటీఆర్ ట్వీట్ టై రాత్రి 10 గంట‌లు.

దీనికి ఎంత ఆలోచించినా పొంత‌న కుద‌ర‌డం లేదు. వాస్త‌వానికి స్క్రీన్ షాట్ టైం ల‌గ‌డ‌పాటి ప్రెస్ మీట్ త‌ర్వాత ఉండాలి. కానీ అంతకు మ‌నుపు మూడు గంట‌ల ముందే ఉంది. మ‌రి ఇది ఫొటోషాప్ మిస్ ఫైరా? లేక‌పోతే మ‌ధ్యాహ్న‌మే ల‌గ‌డ‌పాటి కేటీఆర్‌కు ఫ‌లితాలు చెప్పాడా? లేక‌పోతే అస‌లు ల‌గ‌డ‌పాటి ఈ విష‌యాలు ఎవ‌రితో చ‌ర్చించ‌నే లేదా? ఎంత త‌ల‌గోక్కున్నా అర్థం కావ‌డం లేదు జ‌నాల‌కి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English