రాహుల్ ప‌ప్పు... ఎందుక‌న్నావో చెప్పు!

రాహుల్ ప‌ప్పు... ఎందుక‌న్నావో చెప్పు!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని బీజేపీ నేతలు గ‌తంలో పప్పు అని విమ‌ర్శిస్తుండేవారు. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కోస‌మే కాదు...విలేక‌రుల స‌మావేశాల్లో కూడా సీనియ‌ర్ నేత‌లు ఈ ర‌క‌మైన ప‌ద‌బందంతో విమ‌ర్శ‌లు చేస్తుండే వారు.

అయితే ఈ మ‌ధ్య రాహుల్ చాలా మెరుగ‌య్యారు. ప్ర‌సంగాల్లోనూ ప‌దును పెరిగింది. పంచ్‌లు వేయ‌డంలో రాటు దేలారు.  దీంతో రాహుల్‌ను అలా అన‌డం చాలా త‌గ్గింది.
 
అయితే తాజాగా రాహుల్‌ను పప్పు అని ఓ ఎంపీ ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. ప్ర‌స్తుతం హాట్ హాట్‌గా ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాజ‌స్థాన్‌లో ఈ ప‌రిణామం జ‌రిగింది.  రాజస్థాన్‌కు చెందిన‌ బీజేపీ ఎంపీ దేవాజీభాయ్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిని ప‌ప్పు అని పిల‌వ‌డంతో ఓ మ‌హిళా నేత సీరియ‌స్ అయ్యింది. వాగ్వాదానికి దిగింది. బీజేపీ ఎంపీ దేవాజీ భాయ్ తాను పాల్గొన్న ఓ సమావేశంలో పదే పదే రాహుల్‌ను పప్పు అని పిలవడం మొదలుపెట్టారు.

దీంతో ఆ సమావేశంలోనే ఉన్న కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ సీతా దామోర్ ఆయనకు ఎదురు తిరిగారు. మా నాయకుడిని పప్పు అంటావా అంటూ ఎంపీతో వాగ్వాదానికి దిగారు. "రాహుల్‌ను పప్పు అనడానికి నీకెంత ధైర్యం? మీరెలా ఆ పదాన్ని వాడారో చెప్పండి" అంటూ ఎంపీని నిలదీసింది. దీనికి ఆ ఎంపీ స్పందిస్తూ.. అందరూ రాహుల్‌ను పప్పూ అంటారు కాబట్టి నేను కూడా అన్నాను అని సమర్థించుకున్నారు.

దీంతో సీతా దామోర్ మరింత చెలరేగిపోయింది. అందరూ గోతిలో దూకితే నువ్వు కూడా దూకుతావా అంటూ ఆమె ప్రశ్నించడంతో ఆ ఎంపీ అవాక్కయ్యారు. తమ నాయకుడిని పప్పు అని పిలవడాన్ని తట్టుకోలేకే ఎంపీతో అలా మాట్లాడానని ఆ తర్వాత సీతా దామోర్ వ్యాఖ్యానించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English