యోగి మాట‌ల‌కు ఒవైసీ రిప్ల‌యి విన్నారా?

యోగి మాట‌ల‌కు ఒవైసీ రిప్ల‌యి విన్నారా?

సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేర‌యిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలంగాణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం సంగారెడ్డిలో ప్ర‌చారం చేసి అనంత‌రం వికారాబాద్ జిల్లా తాండూరు బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. దేశంలో ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమపాలనతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం మాదిరిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా హైదరాబాద్ వదిలి పారిపోతారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని, తెలంగాణలోనూ కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని ఆరోపించారు. రామరాజ్య స్థాపనకు బీజేపీ పనిచేస్తుంటే కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో వంశపారంపర్య రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్నదన్నారు.

అయితే, దీనిపై ఎంఐఎం నేత అసుదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. భార‌త్ తండ్రి ద్వారా సంక్ర‌మించిన దేశ‌మ‌ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వీడేది లేద‌న్నారు. `ముస్లిం మ‌త‌గ్రంథాల ప్రకారం పవిత్ర‌మైన మా మ‌త ప్ర‌వ‌క్త స్వ‌ర్గం నుంచి భార‌త‌దేశానికి వ‌చ్చారు. కాబ‌ట్టి మేం ఇక్క‌డ నివ‌సిస్తున్నాం ఈ లెక్క‌న భార‌త్ మా తండ్రి ద్వారా మాకు సంక్ర‌మించిన దేశం. ఇక్క‌డి నుంచి మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ వెళ్ల‌గొట్ట‌లేరు`` అని అన్నారు. ఇలాంటి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌సంగం ఆయ‌న నోటి ద్వారా వ‌స్తున్న‌ప్ప‌టికీ, భావాలు, వ్య‌క్తీక‌ర‌ణ అంతా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీదేన‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో యోగి ఆదిత్య‌నాథ్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని క‌నీసం త‌ను కూర్చున్న సీటుకు అయినా విలువ ఇవ్వాల‌ని కోరారు

ఈ సంద‌ర్భంగా నిజాం రాజును ప్ర‌స్తావిస్తూ ఆదిత్య‌నాథ్‌ను ఎద్దేవా చేశారు. ``నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి యోగి ఆదిత్య‌నాథ్‌కు స‌రిగా తెలియ‌న‌ట్లుంది. ఆయ‌న రాజ‌ప్ర‌ముఖుడిగా వివిధ దేశాల‌తో సంబంధాలు కొన‌సాగించారు. యుద్ధాలు చేశారు. ఇది తెలుసుకోవాలి` అని అన్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో  ప‌ర్య‌టించే ముందుగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 150 చిన్నారులు అకార‌ణంగా మృత్యువాత ప‌డిన వంటి సంఘ‌ట‌న‌ల గురించి ముందుగా జాగ్ర‌త్త ప‌డాలి అని సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English