క‌విత‌కు ప్ర‌శ్నలు... జవాబులు కష్ట‌మే !

క‌విత‌కు ప్ర‌శ్నలు... జవాబులు కష్ట‌మే !

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నాటికి బ‌లంగా ఉన్న టీఆర్ఎస్ ఊహించ‌ని విధంగా బ‌ల‌హీన‌ప‌డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మ‌ళ్లీ క‌థ కంచికే అనుకున్న కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్ నేత‌ల్లో ఎక్క‌డ లేని ఉత్సాహం క‌నిపిస్తోంది. మొత్తానికి పోరు హోరాహోరీగా కొన‌సాగుతోంది.

తాజాగా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మ‌ధు యాష్కీ టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. వాటిలో ఏ ఒక్కదానికీ ఆమె వ‌ద్ద నుంచి రెస్పాన్స్ లేదు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే...

1. భోదన్‌ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వందరోజుల్లో తెరిపిస్తామని ఎంపీ కవిత ఇచ్చిన హామీ ఏమైంది?

2. జిల్లాలో కవిత ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్ ఇల్లు క‌ట్టించిందా?

3. తెలంగాణ జాగృతి ఆస్తులను ప్రకటిస్తామని గతంతో కవిత అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు?.

వీటిలో దేనికీ ఆమె వ‌ద్ద స‌మాధానాలు కూడా లేవన్న‌ది వేరే విష‌యం. కానీ క‌విత నుంచి స్పంద‌న మాత్రం రాలేదు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ముందస్తు ఎన్నికలకు పోయిన కేసీఆర్‌కు మూతిపండ్లు రాలతాయి. ఓటమి భయంతో  కేసీఆర్‌ సహనం కోల్పోతున్నారని అన్నారు. మేం అధికారంలోకి రాగానే వారి కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ బయటపెడతాం. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌లో వేల కోట్ల కుంభకోణం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేటీఆర్‌ బావమరిదిని జైలుకు పంపుతాం. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేటీఆర్‌ది అన్నారాయ‌న‌. కేసీఆర్‌ది దైవభక్తి కాదు, ధనభక్తి అని వ్యాఖ్యానించారు. ప్రజాకూటమి నిశ్శబ్ద విప్లవంలా అధికారంలోకి వస్తుందని మధుయాష్కీ జోస్యం చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English