అనూప్ రూబెన్స్ ఎక్కడ?

అనూప్ రూబెన్స్ ఎక్కడ?

గత దశాబ్దంన్నర కాలంలో టాలీవుడ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మరో మాట లేకుండా దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పేయొచ్చు. ఒకసారి స్టార్ స్టేటస్ సంపాదించాక దేవి వెనుదిరిగి చూసుకోలేదు. మణిశర్మ తర్వాత నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించి.. అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఐతే అతడికి గట్టి పోటీ ఇచ్చిన సంగీత దర్శకుల్లో ముందు తమన్ పేరు చెప్పాలి. ఆ తర్వాత అనూప్ రూబెన్స్ ఉంటాడు.

ఇటు దేవి.. అటు తమన్ ఇప్పటికీ మంచి ఊపుమీదే ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ సాగిపోతున్నారు. కానీ అనూప్ రూబెన్స్ మాత్రం ఉన్నట్లుండి రైజ్ అయ్యి మళ్లీ డౌన్ అయిపోయాడు. గత ఏడాది వరకు అతడి కెరీర్ బాగానే సాగింది. నిరుడు ‘పైసా వసూల్’.. ‘నేనే రాజు నేనే మంత్రి’?. ‘హలో’.. లాంటి క్రేజీ ప్రాజెక్టులకు పని చేశాడు అనూప్.

ఆ మూడూ సంగీత పరంగా అనూప్‌కు మంచి పేరే తెచ్చాయి. కానీ ఈ ఏడాది అనూప్ చేతిలో ఒక్క పెద్ద సినిమా లేదు. అసలు 2018లో అనూప్ నుంచి సినిమానే రాలేదు. ఈ పది నెలల్లో అనూప్ సినిమా ఒక్కటీ రిలీజ్ కాకపోవడమే ఆశ్చర్యమంటే అతడి చేతిలో ఇప్పుడు మరో చెప్పుకోదగ్గ తెలుగు సినిమా ఏదీ కూడా లేదు. కొన్నేళ్ల పాటు అక్కినేని కుటుంబం అతడిని బాగా ఆదరించింది. కానీ ఇప్పుడు వాళ్లు కూడా అతడికి అవకాశాలు ఇవ్వట్లేదు.

పెద్ద సినిమాల సంగతి వదిలేస్తే.. ఇంతకుముందులా మీడియం రేంజి సినిమాల్లోనూ అవకాశాలు రావట్లేదు. మరి ఎవ్వరూ అతడికి ఛాన్సులివ్వట్లేదా.. లేక తనే విరామం తీసుకున్నాడా అన్నది అర్థం కావడం లేదు. ‘మనం’.. ‘టెంపర్’ సినిమాల టైంలో దేవి.. తమన్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించిన అనూప్ ఉన్నట్లుండి ఇలా డౌన్ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English