మ‌లేషియాలో కేటీఆర్ అక్ర‌మ‌సంపాద‌న‌ !?

మ‌లేషియాలో కేటీఆర్ అక్ర‌మ‌సంపాద‌న‌ !?

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు.ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని మలేసియా తరలిస్తున్నారని ఆరోపించారు. ఆ పనిని సత్యం రామలింగరాజు కుమారుడు తేజ్‌రాజ్‌ చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న.. చర్చకు కేటీఆర్‌ సిద్ధమా అని కాంగ్రెస్‌ ఎంపీ మధు యాష్కీ సవాల్ విసిరారు.

కేసీఆర్‌ ఏక్‌ నంబరీ ఐతే.. కేటీఆర్‌ దస్‌ నంబరీ అని.. చెల్లి, భావలతో కలిసి తెలంగాణ ఆస్తులను దోచుకున్నారని మ‌ధుయాష్కీ ఆరోపించారు. ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, సినీ నిర్మాతలు, ఏపీ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు.2001లో కేటీఆర్‌ ఆస్తి రూ.1.13 కోట్లు అని.. 2014 నాటికి రూ.7కోట్ల 98 లక్షలకు, 2018కి 41 కోట్లకు పెరగిందని అన్నారు. తెలంగాణ కోసం పిల్లలు ప్రాణ త్యాగం చేస్తే.. కేసీఆర్‌ కుటుంబం ఆస్తులు పెంచుకున్నదని అన్నారు. వెంకయ్యనాయుడు కొడుకు హర్షవర్ధన్‌ నాయుడు, సత్యం రామలింగరాజు కొడుకు తేజారాజులు కేటీఆర్‌ వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. రూ.1500 కోట్ల కాంట్రాక్టును కేటీఆర్‌  తేజారాజు కంపెనీకి దోచిపెట్టారని ఆరోపించారు. ‘కాల్‌ హెల్త్‌’ కేటీఆర్‌ బినామీ కంపెనీ అనీ, ఆ కంపెనీకి తేజారాజు భర్య చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

బెంగళూరులో కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ బినామీల గుట్టు త్వరలోనే బయటపెడతానని మ‌ధుయాష్కీ చెప్పారు. బెంగళూరులో కవితకు విల్లాలు ఉన్నాయని.. ఆమె కొనుగోలు చేసిన విల్లాల ఫొటోలను రేపు బయటపెడతానని ఆయన చెప్పారు. టెండర్లు పిలవకుండా రూ.1500 కోట్ల మిషన్‌ భగీరథ పనులను ఎలా అప్పగించారని ప్రశ్నించారు. సత్యం తేజ్‌ను తీసుకుని కేటీఆర్‌ అమెరికా, సింగపూర్‌, మలేసియా వెళ్లారని ఆరోపించిన మధుయాష్కీ గౌడ్ మలేసియా ప్రధానితో వారిద్దరూ ఉన్న ఫొటోను విడుదల చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English