ల‌గ‌డ‌పాటి స‌ర్వే - సంచ‌ల‌నం

ల‌గ‌డ‌పాటి స‌ర్వే - సంచ‌ల‌నం

ఏపీ, తెలంగాణ‌లో ల‌గ‌డ‌పాటి స‌ర్వే కోసం వేచి చూడ‌ని క‌ళ్లు లేవు.  రిజ‌ల్టు మీద జ‌నాల‌కు ఎంత ఆస‌క్తి ఉందో, ఆల్మోస్ట్ అదే స్థాయిలో ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై అంతే ఆస‌క్తి ఉంది. కాక‌పోతే ... త‌న క‌చ్చిత‌మైన స‌ర్వే వివ‌రాల‌ను ఇంత‌వ‌ర‌కు తాను ప్ర‌క‌టించ‌లేద‌ని, డిసెంబ‌రు 7 వ తేదీ పోలింగ్ ముగిసిన అనంత‌రం ప్ర‌క‌టిస్తాన‌ని ల‌గ‌డ‌పాటి చెప్పారు. అయితే, సినిమాకు ముందు ట్రైల‌ర్ లాగా... స‌ర్వేకు ముందు కొన్ని హైలెట్స్ చెప్పారు ల‌గ‌డ‌పాటి.

ఏ పార్టీ గెలుస్తుందో పోలింగ్ త‌ర్వాత వెల్ల‌డిస్తాను అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్, రెబెల్ అభ్యర్థులు భారీగా ప్ర‌భావం చూప‌నున్నార‌ట‌. 8 నుంచి 10 నియోజకవర్గాల్లో గెలవబోతున్నట్లు చెప్పారు. ఈ హింట్‌తో పెద్ద పార్టీల‌న్నిటికీ ముచ్చ‌మ‌ట‌లు పట్టాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండింటి పేర్లు కూడా చెప్పేశారాయ‌న‌. మహబూబ్‌న‌గర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్య‌ర్థి శివకుమార్ రెడ్డి గెలవబోతున్నార‌ట‌. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో కాంగ్రెస్ రెబ‌ల్‌ అనిల్ జాదవ్ గెలుస్తున్నట్లు ప్రకటించారు. లగడపాటి ప్రకటనతో ఆ నియోజకవర్గాల్లో కలకలం రేగింది.

ఇవే కాద‌ట‌.. మరో 8 నియోజకవర్గాల్లో కూడా స్వ‌తంత్రులు, రెబ‌ల్స్ గెల‌వ‌బోతున్నారు. అంటే వీరి అండ లేకుందే ప్ర‌భుత్వాలు ఏర్ప‌డే ప‌రిస్థితి ఉండ‌బోద‌న్న‌మాట‌. విశేషం ఏంటంటే... గ‌త ఎన్నిక‌ల్లోనూ ప్రధాన పార్టీలు కాకుండా ఇలా చిన్న‌చిత‌కా వాళ్లు 8 మంది గెలిచారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English