కేసీఆర్‌కు ఓటెందుకు వేయ‌కూడ‌దో చెప్పిన కోదండ‌రాం!

 కేసీఆర్‌కు ఓటెందుకు వేయ‌కూడ‌దో చెప్పిన కోదండ‌రాం!

ఎవ‌రు అవున‌న్నా... కాద‌న్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికి వేలెత్తి చూపించలేని ఉద్య‌మ నేత అంటే కోదండ‌రాంగా చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ ఉద్య‌మాన్ని అడ్డు పెట్టుకొని.. ఉద్య‌మ నేప‌థ్యాన్ని చూపించి.. ఉద్య‌మంలో పాల్గొన్న‌ట్లుగా క‌ల‌ర్ ఇచ్చి ప‌ద‌వులు.. కీల‌క స్థానాల్ని సొంతం చేసుకున్నోళ్లు చాలామందే ఉన్నారు.

కానీ.. వారంద‌రికి భిన్నంగా త‌న ఆస్తుల్ని పోగొట్టుకొని మ‌రీ తెలంగాణ కోసం రియ‌ల్ గా కోట్లాడిన అతి కొద్డి ఉద్య‌మ నేత‌ల్లో కోదండరాం మాష్టారు ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటారు. ప‌ద‌వులు పిలుస్తుంటే.. ఎంత‌టి వార‌లైనా విధేయుల‌న్న మాట‌కు భిన్నంగా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆఫ‌ర్ల‌ను ఒంటి కాలితో త‌న్ని.. ఇప్ప‌టికి తాను న‌మ్ముకున్న సిద్ధాంతానికి ప‌రిమిత‌మైన పెద్ద‌మ‌నిషిగా కోదండం మాష్టార్ని చెప్పాలి.

తాజాగా ప్ర‌జా కూట‌మిలో భాగ‌స్వామి అయిన కోదండరాం మాష్టారు తాజాగా కేసీఆర్ పార్టీకి ఎందుకు ఓటు వేయ‌కూడ‌దో సింఫుల్ గా చెప్పేశారు.
తెలంగాణ ఏర్ప‌డిందే నీళ్లు.. నిధులు.. నియామ‌కాల కోస‌మ‌ని.. మ‌రి అలాంటి రాష్ట్రంలో బాల్కొండ‌లో నీళ్లు అడిగితే జిల్లా మొత్తం 144 సెక్ష‌న్ అమ‌లు చేసి నిర్బంధంలో పెట్ట‌డాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాలుగేళ్లుగా సింగ‌రేణి వార‌స‌త్వ ఉద్యోగాల స‌మ‌స్య‌ను నేటికి తీర్చ‌లేద‌న్న మాష్టారు.. మ‌రో రెండు కీల‌క అంశాల్ని త‌న‌దైన శైలిలో ప్ర‌స్తావించారు.

స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్న రైతుల్ని ప‌రామ‌ర్శించేందుకు తాను వ‌స్తుంటే.. త‌న‌ను సైతం పోలీసులు అడ్డుకున్న వైనాన్ని గుర్తు చేశారు. మొక్కితే దేవుడైనా దిగి వ‌స్తాడేమో కానీ కేసీఆర్ మాత్రం ప్ర‌గ‌తిభ‌వ‌న్ దాటి బ‌య‌ట‌కు రారంటూ భారీ పంచ్ వేశారు. అందుకే.. టీఆర్ఎస్‌ను గ‌ద్దె దింపాల‌ని నిర్ణ‌యించుకున్న వైనాన్ని కోదండం మాష్టారు చెప్పారు. ఓవైపు గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో తెగ పీకేసిన‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్న కేసీఆర్‌కు సింఫుల్ మాట‌ల‌తో షాకిస్తున్న కోదండరాం మాష్టారి మాట‌లు తెలంగాణ సామాన్యుల మ‌న‌సుల్లోకి వెళితే.. తుది ఫ‌లితం మ‌రోలా ఉంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మిగిలిన ఈ కొద్ది రోజుల్లో మాష్టారు త‌న మాట‌ల‌తో డోస్ మ‌రింత పెంచుతారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English