పరిపూర్ణానంద తో భాజాపా పరిసమాప్తం?

పరిపూర్ణానంద తో భాజాపా పరిసమాప్తం?

భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో, చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనుసన్నల్లో నడిచే భారతీయ జనతా పార్టీకి బ్రహ్మచారులు, సన్యాసులు ముద్దు అని పార్టీలో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఆ ప్రచారాన్ని తన అధికారంతో, చర్యలతో భారతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిజం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన అమిత్ షా ఇక్కడి నాయకులతో కంటే ఇటీవలే పార్టీలో చేరిన పరిపూర్ణానంద స్వామితో ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు వాపోతున్నారు.

ఇటీవలే పార్టీలో చేరిన పరిపూర్ణానంద స్వామికి ఎక్కువ విలువ ఇచ్చి తమను పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరినప్పటి నుంచి సీనియర్ నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు తీవ్రమయ్యాయంటున్నారు. ప్రచారం పేరుతో పలు నియోజవర్గాలలో పర్యటిస్తున్న పరిపూర్ణానంద స్వామి అక్కడి నాయకుల మధ్య విబేధాలు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో ఏం జరుగుతుంద‌న్న దానిపై పరిపూర్ణానంద నుంచే నివేదికలు తెప్పించుకుంటున్నారని, ఆయన అభిప్రాయాలకే విలువ ఇస్తున్నారని, బీజేపీ సీనియర్ల మనోవేదనగా చెబుతున్నారు.

తెలంగాణలో 70 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వస్తామని ఒకసారి, ఇక్కడ తామే కింగ్ మేకర్ అవుతామని మరోకసారి పరిపూర్ణానంద ప్రకటించడాన్ని సీనియర్ నాయకులు తప్పుపడుతున్నారు. ఇలాంటి ప్రకటనల వలన ప్రజలలో పార్టీ పట్లు చులకన ఏర్పడుతుందని, ఒకే వ్యక్తి రెండు విరుద్ద ప్రకటనలు ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

రెండు రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన అమిత్ షా, సీనియర్ నాయకులకు సమయం కేటాయించలేదని, వారితో మాట్లాడేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదని, కొందరు నాయకులు కినుక వహించారని సమాచారం. పార్టీ అధ్యక్షుడు ఇలా వ్యవహరించడానికి కారణం పరిపూర్ణానంద స్వామి ఇచ్చిన నివేదికలేన‌ట‌. అమిత్ షాకు  సీనియర్ నాయకులు, కార్యకర్తల కంటే సన్యాసులే ము‌ఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English