నోటాకు ఓటేయటమంటూ హైద‌రాబాద్‌లో ప్ర‌చారం

నోటాకు ఓటేయటమంటూ హైద‌రాబాద్‌లో ప్ర‌చారం

తెలంగాణ‌లో హాట్ హాట్‌గా సాగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనేక చిత్రాలు వెలుగులోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అనేక ఆస‌క్తిక‌ర ప‌రిణామాలకు వేదిక‌గా మారుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌లో ఓలా, ఊబెర్ ఇతర కంపెనీల డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. ‘మై ఓట్ ఈజ్ నోటా’ అంటూ ప్రతీ క్యాబ్ విండ్‌షీల్డ్‌పై అతికించిన స్టిక్కర్లతో ప్రజలను ఆకర్షించే విధంగా నగరంలో ప్రచారం ప్రారంభించారు.

దాదాపు 400 పైగా క్యాబ్‌లు జీహెచ్ఎంసీ పరిధిలో సంచరిస్తుండగా.. డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు కలిసి మొత్తం ఓటర్ల సంఖ్య 4.5 లక్షల పైమాటే. అయితే, వీరికి అనేక స‌మ‌స్య‌లు నెల‌కొన్నాయి. దీంతో వారు ప‌లుమార్లు ఆందోళ‌న‌లు, స‌మ్మెలు చేశారు. అయితే, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో వారు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఆన్‌లైన్ క్యాబ్ కంపెనీలు తమకు తక్కువ వేతనం చెల్లిస్తూ తమ కష్టార్జితంతో అధిక ఆదాయం సంపాయించుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు తమ సమస్యలపై విన్నవించినా ఏ నేతా పట్టించుకోలేదని డ్రైవర్ల సంఘం ఆరోపిస్తోంది. అందుకే ‘ఓట్ ఫర్ నోటా’ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నామని వారు వెల్లడించారు. గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీ కిలోమీటరుకు రూ 17 చెల్లించాలని నిర్ణయించినా సరైన చట్టం లేకపోవడంతో కేవలం కిమీకు రూ 11-12 చెల్లిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఎన్నికల వేళలో అయినా.. తమ సమస్యలపై పాలకులు స్పందిస్తారని ఈ ఉద్యమం చేస్తున్నాట్టు వారు పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English