`మోడీకి మతపిచ్చి...అమిత్‌షా లాగుపగులుత‌ది`

`మోడీకి మతపిచ్చి...అమిత్‌షా లాగుపగులుత‌ది`

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ మ‌రోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా వల్లే రిజర్వేషన్లు సాధించుకోలేకపోయామని అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ వస్తే మన హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నిజామా బాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా కామారెడ్డి పట్టణంతో పాటు డిచ్‌పల్లి, బోధన్‌, మోర్తాడ్‌ సభల్లో పాల్గొని అనంతరం జగిత్యాల, కరీంనగర్‌ సభల్లో మాట్లాడారు. `ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వనీయబోమంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అడ్డందిడ్డంగా మాట్లాడుతున్నడు. ప్రధానికేమో మతం, కులమనే బీమారీ ఉంది. అమిత్‌షా నీ లాగు పగుల్తది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఓటమి ఖాయం' అని వ్యాఖ్యానించారు.

దేశంలో ప్రజాస్వామ్యం పరిణితి చెందలేదని కేసీఆర్‌ చెప్పారు. 'ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఒక పార్టీ, ఒక అభ్యర్థి గెలవడం కాదు. ప్రజల అభీష్టం గెలవాలి. ప్రజలు కోరుకుంది కావాలి' అని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఇదే అజెండాను అమల్జేస్తోందన్నారు. 58 ఏండ్లు పాలిం చిన పార్టీలు కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో విద్యుత్‌ ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త అని తెలిపారు.  దేశ విద్యుత్‌ ప్రాధికార సంస్థ పరిశీలనలో తలసరి వినియోగంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే జనరేటర్లే దిక్కవుతాయని హెచ్చరించారు. కాళేశ్వరం, మధ్యమానేరు లాంటి ప్రాజెక్టులతో జిల్లా, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని, మరో నెల రోజుల్లో మిషన్‌ భగీరథ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పిల్లలు పుడితే రూ.12 నుంచి రూ.13వేలు కేసీఆర్‌ కిట్లు మానవీయ కోణంతో ఇస్తున్నా మని చెప్పారు.

కాంగ్రెసోళ్లకు చేతగాక ఆంధ్రాకు పోయి చంద్రబాబును తెస్తున్నారని కేసీఆర్ పున‌రుద్ఘాటించారు. ప్రతి ప్రాజెక్టు నూ అడ్డుకోడానికి 33 ఉత్తరాలు రాశారని, 50 నుంచి 60 కేసులు వేశారని విమర్శించారు. పొరపాటున చంద్రబాబు కూటమి తరపున గెలిస్తే ప్రాజెక్టులు మూతపడి మళ్లీ పాత రోజులు వస్తాయన్నారు. సాగునీటిపై కాంగ్రెస్‌ కిరికిరి రాజకీయాలు చేస్తోందని, సింగూరు నుంచి నిజాంసాగర్‌కు నీళ్లు తెస్తే.. జహీరాబాద్‌ నీళ్లు తరలిస్తున్నారని ధర్నా చేశారని అన్నారు. నీళ్లకు ప్రాంతంతో సంబంధం ఉంటుందా? అని ప్రశ్నించారు. జూన్‌ తరువాత కాళేశ్వరంను ఎస్‌ఆర్‌ ఎస్పీకి లింక్‌ చేస్తే ఎప్పుడూ నిండుకుండలా ఉంటుందన్నా రు. గిట్టుబాట ధర కల్పించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూ నిట్‌ నెలకొల్పుతామని చెప్పారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English